2019 ఎన్నికల్లో చాలా ఘోర పరాజయం చవిచూసిన పవన్ కళ్యాణ్ మూడేళ్లు సినిమాలతో గడిపేశాడు. కమ్ బ్యాక్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు విడుదల చేశారు. ఇక హరి హర వీరమల్లు సినిమా సెట్స్ పై ఉండగా... అలాగే మరో రెండు మూడు చిత్రాలు ప్రకటించారు. ఇక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సమయం రాజకీయ కార్యక్రమాలకే ఆయన కేటాయిస్తున్నారు.గతంతో పోల్చితే జనసేన పార్టి ఎంతో కొంత బలపడిందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ తగిలింది.ఇక రెండు జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో జనసేన పార్టీ ప్రస్తావనే లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 ఇంకా టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే తేల్చింది. మరో జాతీయ మీడియా వైసీపీకి 19 ఇంకా టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక సదరు మీడియా సంస్థల సర్వే ప్రకారం... వై ఎస్ జగన్ 120 నుండి 130 అసెంబ్లీ స్థానాలు గెల్చుకొని రెండోసారి అధికారం చేపట్టడం కూడా ఖాయం.ఇక అత్యంత విశ్వసనీయ కలిగిన ఈ రెండు సర్వేల్లో జనసేన-బీజేపీ కూటమికి కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు. అంటే జనసేన పార్టీ పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని పవన్ కళ్యాణ్ కి అర్థమైంది.


మిగిలిన ఈ కొంచెం సమయంలో మరింత కష్టపడి జనాల్లో విశ్వసనీయత సాధించాలని పవన్ కళ్యాణ్ భావించే అవకాశం కలదు. ఈ క్రమంలో ఆయన మధ్యలో ఉన్న చిత్రాలతో పాటు ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసే ఆలోచన చేయకపోవచ్చు. ఇక 2024 లోపు పవన్ కళ్యాణ్ నుండి సినిమా రావడం కష్టమే, ఆయన తీరిక లేకుండా రాజకీయాల్లో తలమునకలు అవుతాడని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.అక్టోబర్ 5 వ తేదీ నుండి బస్సు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి హాజరయ్యే ఛాన్స్ లేదు. ఇక మొత్తంగా ప్రస్తుత సమీకరణాలు పరిశీలిస్తే.. పవన్ కళ్యాణ్ సినినిమాలకు దూరమవుతారని అనిపిస్తుంది. మరోవైపు హరి హర వీరమల్లు నిర్మాతల నుండి కూడా ఆయన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.ఈ సినిమా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ఇంకా అలాగే భవదీయుడు భగత్ సింగ్ నిర్మాతలుగా ఉన్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్సుగా ఇచ్చిన రూ. 40 కోట్లు కూడా తిరిగి ఇచ్చేయాలని పవన్ ని కోరుతున్నారట. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: