ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్‌ఓ లో పొదుపు చేస్తున్నారు.. ఇందులో తక్కువ మొత్తంలో ఎక్కువ రాబడి పొందవచ్చు..అయితే ఈ విషయంలో ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తూ వస్తోంది. పెన్షనర్ల పనిని సులభం చేసేలా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చింది. తాజాగా పెన్షనర్లు నిర్దిష్ట గడువు అనేది లేకుండా ఎప్పుడైనా ఈ డాక్యుమెంట్‌ను అందించవచ్చని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.సాధారణంగా పెన్షనర్లు నవంబరు 30లోగా లైఫ్ సర్టిఫికేట్లను సబ్‌మిట్‌ చేయాల్సి ఉంది. అయితే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద పెన్షన్ పొందుతున్న వారికి ఈ నియమం వర్తించదని ఈపీఎఫ్‌వో తాజాగా ప్రకటించింది.


గతంలో డాక్యుమెంట్‌ను సబ్‌మిట్ చేసిన తేదీ నుంచి సంవత్సరం పాటు అది చెల్లుబాటు అవుతుందని తమ అఫిషియల్‌ పోస్ట్ చేసింది. ఆ గడువు దాటకుండా మాత్రం సర్టిఫికెట్‌ సమర్పించాలని కోరింది..పెన్షనర్లుఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఇందుకు డెడ్‌ లైన్లు అంటూ ఏమీ లేవు. ఉదాహరణకు పెన్షనర్లు గత సంవత్సరం డిసెంబర్ 31న లైఫ్‌ సర్టిఫికెట్ సమర్పిస్తే.. ఈ సంవత్సరం కూడా అదే తేదీ లోపు దాన్ని సబ్‌మిట్‌ చేయాలి. లేకుంటే 2023 జనవరి నుంచి పెన్షన్ చెల్లింపులు ఆగిపోతాయి. అంటే ఇప్పటికే సమర్పించిన జీవన ప్రమాణ పత్రం.. సబ్‌మిషన్ తేదీ నుంచి 12 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది..


యజమాని, ప్రభుత్వాల నుంచి డబ్బులు స్కీమ్‌లో చేరతాయి. ఆ మొత్తం నెలకు రూ. 15,000 మించకుండా ఉంటుంది. దీని కోసం వేతనంలో యజమాని 8.33 శాతం, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఆ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపుల ఆధారంగా దాదాపుగా 1.16శాతం జమ చేయాల్సి ఉంటుంది..ఎలా పొందుపరచాలి అంటే.. మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. PPO సంఖ్య, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. ఉమంగ్ యాప్, సమీప ఈపీఎఫ్‌ఓ కార్యాలయం, పెన్షన్‌ డిస్బర్సింగ్‌ బ్యాంక్‌, కామన్ సర్వీస్ సెంటర్, ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌, పోస్ట్ ఆఫీస్‌, పోస్ట్‌ మ్యాన్‌ల ద్వారా వీటిని పొందుపరిచే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: