ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత తెలుగులో ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో కేసీఆర్ కుమార్తె కవిత హవా నడిచింది. అయితే బీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్ కుమార్తె గ్రహచారం కూడా ఏమీ బాగోలేదు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. తీహార్ జైలుకు తరలించింది. అయితే జైలులో తనకు కల్పించే సౌకర్యాలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలు అధికారులు తాను కోరినవి ఇవ్వడం లేదని కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఆమె అడగ్గానే ఇవ్వడానికి అదేమీ తెలంగాణ కాదని, తీహార్ జైలు అని గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

తొలుత కేసీఆర్ కుమార్తెగా పేరొందిన కవిత అనంతరం  రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకునేందుకు ప్రయత్నించారు. ఆమె నిజామాబాద్ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఆమె ఓడిపోయారు. కొన్నాళ్లకే కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీనిపై నలువైపులా విమర్శలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఈ పదేళ్లలో ఆమె హవా నడించింది. ఒకప్పుడు హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో కవిత ఉన్నారు. తండ్రి కేసీఆర్ సీఎం అయ్యాక ఆమె వ్యాపారం విస్తరించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమె వేలు పెట్టడంతో ప్రస్తుతం జైలులో ఉంది. తన బినామీలు, ఇతరులతో ఆమె రూ.200ల కోట్లను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని ఆరోపణ. ఈ కేసులో ఆధారాలు దొరకకూడదని ఆమె 15 ఫోన్లు మార్చింది. ఆ ఫోన్లలో సమాచారం ఏదీ దొరకకుండా ఫార్మాట్ చేయించింది.


అయినప్పటికీ లిక్కర్ కేసులో ఆమె ప్రమేయంపై కీలక ఆధారాలు లభించడంతో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైలుకు ఆమెను పంపింది. జైలు మాన్యువల్ ప్రకారం కవితకు పరుపు, చెప్పులు, బట్టలు, షీట్, దుప్పటి ఇచ్చారని, ఆమెకు మందులు కూడా ఇచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. కోర్టు ఆదేశాలు, జైలు మాన్యువల్ ప్రకారం ఆమెకు వస్తువులు అందజేస్తామని ఒక అధికారి తెలిపారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు కవిత ఇంట్లో వండిన ఆహారం, పరుపు, చెప్పులు, బట్టలు, బెడ్‌షీట్, దుప్పటి, పుస్తకాలు, పెన్ను పేపర్లు, మందులు పొందేందుకు అనుమతి ఉంది. అవి తనకు అందివ్వడం లేదని కవిత ఆరోపిస్తున్నారు. అయితే కోరినవి ఇవ్వడానికి ఇది తండ్రి ఇల్లు కాదని నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. చెప్పినట్లు నడుచుకోవడానికి అది తెలంగాణ కాదని, తీహార్ జైలు అని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: