ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... ట్రంప్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది మోడీ సర్కార్. సుంకాల విషయంలో అమెరికాకు షాక్ ఇస్తూ.. తాజాగా మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా వస్తువులపై ప్రతికార సుఖాలు వేయడానికి ఇండియా కూడా సిద్ధం అయిపోయింది. అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్ పై కూడా అనేక ఆంక్షలు విధించారు.

 ఇప్పటికే భారత్లో తయారయ్యే ఉక్కు పై సుఖాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో కొన్ని అమెరికా వస్తువులపై ప్రతికార సుఖాలు వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇండియా తరఫున... అధికారులు వెల్లడించడం జరిగింది. అటు అమెరికా విధించిన టారిఫ్ల వల్ల 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై.. భారం పడుతుందన్న సంగతి తెలిసిందే.

 ఈ విషయంలో ఇండియన్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఇప్పుడు అమెరికా వస్తువులపై కూడా  సుంకం విధిస్తోంది. ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లే స్టీల్ మరియు అల్యూమినియం... లాంటి మూలకాలపై సుంకాలకు ప్రతి స్పందనగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు అమెరికాకు.. అధిక భారం పడుతుందని చెబుతున్నారు. కాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను అని ట్రంప్ ప్రకటించిన రెండో రోజే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: