
2019 నుంచి 2024 మధ్యలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక డిష్ టైలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదని వివరించారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా వైసిపి నేతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఏమో ఆ డిస్టల్లరీ లు మొత్తం వైయస్ జగన్మోహన్ రెడ్డి చుట్టాలవి అంటూ... తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైన దేవుడు ఉన్నాడు.... కింద ప్రజలు ఉన్నాడు అని జగన్ మోసపోయాడని వెల్లడించారు.
కానీ మధ్యలో నారా చంద్రబాబు నాయుడు... నందిని పంది చేసి చూపిస్తున్నాడని ఫైర్ అయ్యారు. అలాంటి చంద్రబాబు నాయుడును తక్కువ అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి బోల్తాపడ్డాడని తెలిపారు. అందుకే వైసిపి నాయకులు అందరికీ ఈ కర్మ పట్టిందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇకనైనా చంద్రబాబు నాయుడు ను... పసిగట్టి వెంటాడాలని సూచించారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు