ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒక పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2029 సంవత్సరంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి సర్కార్ కొన్ని సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయకపోవడం మైనస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే రాష్ట్రంలో  వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని విషయంలో ఏ విధంగా వ్యవహరించబోతోందనే ప్రశ్నకు ఆసక్తికర జవాబులు వినిపిస్తున్నాయి.  జగన్  వైసీపీ అధికారంలోకి వస్తే  రైతులు, భూ యజమానులకు భారీ స్థాయిలో లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.  అభివృద్ధి చేయడం ద్వారా ఆ ఫలాల ప్రయోజనాలను రైతులు పూర్తిస్థాయిలో పొందాలని  వైసీపీ ఆలోచన అని  సమాచారం అందుతోంది.

మంగళగిరికి రాజధాని నగరంగా అభివృద్ధి చెందేలా జగన్ అడుగులు వేయనున్నారని భోగట్టా.  విజయవాడ, గుంటూరు, మంగళగిరి నగరాలను కలిపి  40 లక్షల  జనాభాతో రాజధానిని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఒక విధంగా   ఇది మంచి నిర్ణయం అవుతుందని సోషల్ మీడియా వేదికగా  కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.  గతంలో ఎదురైన విమర్శలకు  చెక్ పెట్టేలా జగన్ అడుగులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

చిలకలూరిపేట, తెనాలి  నియోజకవర్గాలకు సైతం మేలు జరిగేలా  జగన్ అడుగులు  వేయనున్నారని సమాచారం అందుతోంది. జగన్  భవిష్యత్తు  ప్రణాళికలు అద్భుతంగా ఉండనున్నాయని కచ్చితంగా రాష్ట్రానికి మళ్ళీ సీఎం అవుతున్నానని  జగన్ నమ్ముతున్నారని  తెలుస్తోంది.  ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందేలా వైసీపీ నిర్ణయాలు ఉండబోతున్నాయని  పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: