గత కొద్దిరోజులుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు సక్సెస్ అవుతూ ఉండడంతో చంద్రబాబు సర్కార్ కు నచ్చడం లేదని.. అందుకే పలు రకాల ఆంక్షలు, నిర్బంధాలు విధిస్తూ ఉన్నారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.. ఇలా ఎన్నో అడ్డంకుల మధ్య నెల్లూరు జిల్లా పర్యటన కూడా విజయవంతంగా ముగిసింది. జగన్ అడ్డుకునే ప్రయత్నం పోలీస్ శాఖకు అప్పగించిన కూడా అడ్డుకోలేకపోయారనే వాదన వినిపిస్తున్నది. దీంతో ఏకంగా వైసిపి నేతలపైన కేసులు పెట్టారనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పైన రెండు కేసులు నమోదయ్యాయి.. ముఖ్యంగా అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించడం తో మరొక కేసు నమోదైనట్టు సమాచారం. జగన్ వస్తున్నారని  తెలియగానే ఒక్కసారిగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రి గోడ కూడా కూలిపోయిందట.. దీంతో వైసిపి నేతలు ఈ గోడ కూల్చేశారంటూ కేసు నమోదు చేసినట్లు వినిపిస్తోంది. కానీ కూటమి నేతలు మాత్రం అసలు జగన్ ను చూడడానికి ప్రజలే రాలేదని కేవలం అదంతా గ్రాఫిక్స్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.



కానీ ఇలాంటి సమయంలోనే  వైసిపి నేతల మీద, కార్యకర్తల మీద ఇలా కేసులు పెట్టడంతో జనమే రానప్పుడు  వైసిపి నేతల మీద కార్యకర్తల మీద ఈ కేసులు పెట్టిన వారికే ఈ ప్రచారం గురించి తెలియాల్సి ఉంది అంటూ పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. వైసిపి నేతలు మాత్రం కూటమి మీడియా, నేతలు చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి చాలా తేడా ఉంది అంటూ ఎక్కడ పొంతన కుదరలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తానికి జగన్ వెంట జనం స్తున్నారా .. రాలేదా అన్న విషయం నేతలకే తెలియాల్సి ఉంది. కూటమిగా మరో 15 ఏళ్లు జతగానే ఉంటామంటూ అటు పవన్ కళ్యాణ్ వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: