ప్రతీ వైన్‌ షాప్‌లో నాలుగు ఉద్యోగాలు...!!
నూతన మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేస్తోంది. సొంతంగా మద్యం షాపులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికిగాను ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబరు నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం నూతన మద్యం విధానం రూపొందించడంలో, అధికారులు నిమగ్నమయ్యారు. మద్యం పాలసీలో సరికొత్త సంస్కరణలు తీసుకురావడం ద్వారా దశలవారీగా మద్యం నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానిలో భాగంగా, ఏటా 25 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలు దాటితే మద్యం విక్రయాలను నిలిపివేయాలని కూడా నిర్ణయించింది.

ఇలా కొత్త కొత్త ఆంక్షలు, నిబంధనలు విధించడం ద్వారా మద్యం నిషేధం వైపు ప్రభుత్వం అడుగులేస్తోంది. నాలుగు ఉద్యోగాలు ఒక్కో మద్యం షాపులో ముగ్గురు సేల్స్‌ మెన్లు, ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలని ఎక్పైజ్‌ శాఖ ప్రతిపాదనలు పంపించింది. మద్యం షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేసే వ్యక్తి నుంచి డిపాజిట్‌ సేకరించనున్నారు. షాపు ఆర్ధిక లావాదేవీలన్నింటికీ సూపర్‌వైజర్‌నే బాధ్యుడుగా చేయనున్నారు.

ఇలా నియమించిన సిబ్బంది జీతభత్యాలు, ఇతరత్రా అలవెన్సుల విషయంపై త్వరలో స్పష్టత రానుంది. తమిళనాడులో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడి విధానమే మన రాష్ట్రంలో అమలు చేయాలన్నది ప్రభుత్వ భావన. అక్టోబరు 1 నుంచి ఈ విధానం అమలు చేయడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

ప్రతి రోజు జరుగుతున్న విక్రయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం వల్ల ఎక్సై.జ్‌, అబ్కారీ శాఖపై అదనపు భారం పడినప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని,కల్తీ మద్యం అరికట్ట వచ్చని పరిశీలకులంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: