పయ్యావుల కేశవ్...తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. దురదృష్టం ఏమిటంటే పయ్యావుల ఒక్క 1994లో తప్ప మిగతా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగా, మొన్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే పయ్యావుల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై పార్టీ తరుపున తన వాయిస్ బలంగా వినిపించేవారు.


ఒకానొక సమయంలో దివంగత వైఎస్సార్ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న పయ్యావులని ప్రశంసించిన రోజులు ఉన్నాయి. కానీ అలాంటి నేత ఇప్పుడు పూర్తి సైలెంట్ గా ఉన్నారు. ఒకవైపు తమ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న పయ్యావుల మాత్రం సైలెంట్ గా ఉడిపోయారు. పి‌ఏ‌సి ఛైర్మన్ గా ఉన్న పెద్దగా వైసీపీ ప్రభుత్వంపై స్పందించడం లేదు. అయితే ఇలా సైలెంట్ గా ఉన్న నేతని వైసీపీ టార్గెట్ చేసింది. రాజకీయంగా దెబ్బతీసేందుకు ఉరవకొండలోని ఆయన సొంత గ్రామం కౌకుంట్ల పంచాయతీని విభజించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.


ఇదే విషయం ఇప్పుడు పయ్యావుల వాయిస్ రైజ్ అయ్యేలా చేసింది. గ్రామాన్ని విభజించి తన ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్న స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిపై మండిపడుతున్నారు. మొన్నటివరకు ప్రభుత్వం మీద ఒక్క విమర్శ చేయని...పయ్యావుల తన సొంత నియోజకవర్గంలో విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. తన బలాన్ని తగ్గించేందుకు గ్రామాన్ని విభజించి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.


ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రభుత్వం ముందుకెళ్ళేందుకు చూస్తుందని తెలుస్తోంది. అలా అని పయ్యావుల కూడా వెనక్కి తగ్గట్లేదు. దీనిపై ఎంతదూరమైన పోరాడతానని అంటున్నారు. అయితే రాష్ట్రంలోని సమస్యలపై స్పందించని పయ్యావుల...నియోజకవర్గం విషయానికొచ్చేసరికి వాయిస్ పెంచడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్రం విషయంలో ఏం చేసిన ఫలితం ఉండదు. కాబట్టి నియోజకవర్గం మీద ఫోకస్ పెడితే వచ్చే ఎన్నికల నాటికి ఉపయోగముంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: