సాధారణంగా క్రికెట్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ప్రారంభమవుతు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇలాంటి కొత్త ట్రెండ్ ప్రారంభం అయిందంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఇక దీని గురించి చర్చించుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు పంచ క్రికెట్ లో ఒక పదం బాగా వైరల్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరి నోట బజ్ బాల్ అనే పదం వినిపిస్తూ ఉంది. దీంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ పదం గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ బజ్ బాల్ అంటే ఏమిటి.. క్రికెట్ కి ఈ బజ్ బాల్ పదానికి సంబంధం ఏంటి అన్నది తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.



 సాధారణంగా సుదీర్ఘమైన టెస్టు ఫార్మాట్  అంటే ఆటగాళ్లు ఎంతో ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా పరుగులు చేస్తూ ఉంటారు. ఆటగాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ బజ్ బాల్ అంటే మాత్రం ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఎటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోవడమే. ఇప్పటికే మొన్న న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ జట్టు ఇదే వ్యూహాన్ని  ఆచరణలో పెట్టింది. న్యూజిలాండ్ నిర్దేశించిన టార్గెట్ ను బెన్ స్టోక్స్, మెకల్లమ్ ఆధ్వర్యంలోనే ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ విధానంలో  ఎంతో అవలీలగా ఛేదించింది అని చెప్పాలి. ఇటీవల ఇండియా తో జరిగిన రీషెడ్యూల్ టెస్టుల్లో కూడా ఇలాంటి  వ్యూహాన్ని  ఫాలో అయింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకోవడం కంటే ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఆరు ఫోర్లతో చెలరేగిపోయింది. ఇక ఇలా టెస్ట్ క్రికెట్ లో గెలుపే లక్ష్యంగా ఎటాకింగ్ మోడ్ లో బ్యాటింగ్ చేయడమే బజ్ బాల్ అంటారు. మెచేలెన్,  బెన్ స్టోక్స్  బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక ఈ వ్యూహాన్ని ఎంతో పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారని తెలుస్తోంది. ఈ ట్రెండ్ తెరమీదకు రావడంతో టెస్ట్ క్రికెట్ కు సరికొత్త శోభను సంతరించుకుంటోంది అనేది తెలుస్తుంది. ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని మరికొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: