ఏంటి టైటిల్ చూడగానే అవాక్కయ్యారు కదా.. న్యాయస్థానాలు కాపురం నిలబెట్టడం గురించి ఇప్పటివరకు విన్నాము..  పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఎన్నో కాపురాలను చక్కబెట్టడం గురించి కూడా తెలుసుకున్నాము.  కానీ బుల్డోజర్ ఎలా కాపురం నిలబెట్టటం ఏంటి..  ఇళ్లను కూల్చే బుల్డోజర్ కి కాపురం నిలబెట్టే సత్తా కూడా ఉంటుందా అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు కదా.. ఇక్కడ జరిగిన అసలు విషయం తెలిస్తే మాత్రం నిజంగానే బుల్డోజర్ కాపురం నిలబెట్టింది అని గట్టిగానే నమ్ముతారు అని చెప్పాలి. ఇందుకు  సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇటీవలి కాలంలో ఎంతో మంది యువతులు కోటి ఆశలతో పెళ్లి చేసుకొని అత్తారింట్లో  అడుగుపెట్టిన తర్వాత ఆ ఆనందం అమ్మాయికి  ఎక్కువ రోజులు వరకు  ఉండటంలేదు. అత్తమామలు కొన్నాళ్ళకి నిజస్వరూపాన్ని బయటపెట్టి దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అదనపు కట్నం కావాలని భర్త చేతిలో  ఎంతో మంది యువతులు చిత్రహింసలకు గురవుతున్న ఘటనలు కోకొల్లలు అని చెప్పాలి. ఇలాంటి వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.


 ఇక్కడ కూడా అదనపు కట్నం వేధింపులకు సంబంధించిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అధికారులు ఓ కోడలు కాపురాన్ని చక్కదిద్దేందుకు బుల్డోజర్ మార్గాన్ని ఎంచుకున్నారు. హల్దౌర్  పోలీస్ స్టేషన్ పరిధి లోని హరి నగర్ లో కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడడం తో పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల తో  అత్తింటికి వెళ్ళింది. కానీ అత్త  తలుపులు తీయలేదు. దీంతో మరో సారి పోలీసులను ఆశ్రయించింది యువతి.  దీంతో బుల్డోజర్ తో ఇల్లు కూల్చేస్తాం  అంటూ చెప్పడం తో చివరికి తలుపులు తీసిన అత్తా కోడలిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఇలా  బుల్డోజర్ ఆమె కాపురం నిలబెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: