ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ గత కొంతకాలం నుంచి మాత్రం ఫేలవమైన ఫామ్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు పరుగుల వరద పారించి ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించగలిగిన సత్తా ఉన్న డేవిడ్ వార్నర్ ఎందుకో తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు వార్నర్. మరికొన్ని రోజుల్లో తన మునుపటి ఫామ్ ను అందుకుంటాడని కొంతమంది అతనికి మద్దతుగా నిలుస్తూ ఉంటే వార్నర్ పని అయిపోయింది అంటూ ఇంకొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.



 అంతేకాకుండా డేవిడ్ వార్నర్ సెంచరీ చేసి దాదాపు ఒక వెయ్యి 30 రోజులకు పైగానే గడిచిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ నుంచి ఒక సాలిడ్ సెంచరీ రావాలని కనీసం ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే బాగుండు అని అభిమానులందరూ ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డేవిడ్ వార్నర్ ఇక ఎప్పుడు ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి. సెంచరీ చేయలేదు కానీ ఏకంగా సెంచరీ చేసినంత పని చేసేసాడు డేవిడ్ వార్నర్.


 ఏకంగా 86 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇక గత కొంతకాలం నుంచి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నా మరో స్టార్ ప్లేయర్స్ స్విత్ సైతం 90 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇందులో డేవిడ్ మలాన్ ఒక్కడే 134 పరుగులు చేయడం గమనార్హం. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేసారు. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించడంతో 46.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేదించింది ఆస్ట్రేలియా జట్టు. తద్వారా మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే డేపిడ్ వార్నర్ సెంచరీ చేయకపోయినప్పటికీ తన ఇన్నింగ్స్ తో మరోసారి ఫామ్ లోకి వచ్చినట్లు నిరూపించాడు దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: