ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే నినాదంతో ప్రచారం చేసి చివరికి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆయనకు వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ నిలిచారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పాలన అద్భుతంగా సాగుతోందని చెబుతున్నారు.. అంతేకాదు వారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే నాలుగు వాగ్దానాలు పూర్తవగా ఇంకా రెండు వాగ్దానాలు అలాగే ఉన్నాయి. కానీ అది కూడా ఈ మధ్యకాలంలో పూర్తయినట్టే వారు చూపిస్తున్నారని తెలుస్తోంది.. మరి ఆ రెండు పథకాలు పూర్తిగా అమలు చేస్తారా లేదంటే పంగనామాలు పెడతారా అనేది తెలుసుకుందాం.. 

సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కీలకమైన అడుగులు పడుతున్నాయి. ఇందులో గ్యాస్ పథకానికి సంబంధించి దీపం పథకం ద్వారా  ఒకటి రెండు సిలిండర్లు అయిపోయి, మూడవ సిలిండర్ దాకా వచ్చింది. ఇక రెండవ పథకం తల్లికి వందనం.. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 15000 అని చెప్పి 13000 అందిస్తున్నారు.. ఇందులో స్కాలర్షిప్ వచ్చేవారిని తీసివేసి మిగతా వాళ్ళందరికీ అందిస్తున్నారు.. ఇక నెంబర్ 3 అన్నదాత సుఖీభవా పేరుతో పథకం అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల అందిస్తే, 5000  రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.  ఈ విధంగా ఈ పథకం కూడా అమలు చేశామని వారు చెప్పుకొస్తున్నారు. ఇంకా రెండు పథకాలు అలాగే ఉన్నాయి.

 ఒకటి నిరుద్యోగ భృతి మరొకటి పేద మహిళలకు సంబంధించి సహకారం. అయితే వీటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ తో లింక్అప్ చేశామని, ఇక నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు లభిస్తాయి ఇక నిరుద్యోగ భృతి ఇవ్వడం అక్కర్లేదని అంటున్నారు. ఇక మహిళలకు ఇచ్చే సహకారానికి సంబంధించి P4లో జత చేసామని  వారు కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి అవి కూడా ఇవ్వనక్కర్లేదంటూ ప్రభుత్వమే ఇకముందు చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా చూస్తే ఆరు పథకాలు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినట్టే అవుతుందని, ఈ విషయాలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు వేదికల మీద చెబుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: