హిందువులకు మాములుగా వచ్చే అన్ని పౌర్ణిమలలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణమి అంటే మహా ప్రీతి. కార్తీక మాసంలో శివుని భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు.  ఇది హరి హరులకు అత్యంత ముఖ్యమైనది. మనకున్న అన్ని తెలుగు మాసాలలో ఈ కార్తీక మాసానికి చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయని వేదాలు మరియు పురాణాలు చెబుతున్నాయి.  అటు 'శివునికి , ఇటు విష్ణువుకు ఇరువురికీ ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి, ఈ మాసంలో మానవులంతా వారిద్దరినీ భక్తి శ్రద్ధలతో కొలిస్తే  వారికి ఎంతో శుభం కలుగుతుందని పురాణాలలో చెప్పబడి ఉన్నది.  ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.

సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు; అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి.
ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి.

శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్తయిన  ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతవరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: