భారత్ పర్యటనలో భాగంగా  బంగ్లాదేశ్ , నేడు   ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో ఆతిథ్య జట్టు తో  మొదటి టీ 20 మ్యాచ్ లో తలపడాల్సి వుంది.  అయితే  ఈ మ్యాచ్ కు అక్కడ నెలకొన్నవాతావరణం అనుకూలించేలా  లేదు.  దాంతో  మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగులే  మ్యాచ్ ను  రద్దు చేసే  అవకాశం ఉందని  నేషనల్ మీడియా  వెల్లడించింది. గత కొద్దీ రోజులుగా  ఢిల్లీ లో వాయు కాలుష్యం  తారా స్థాయికి చేరింది.  ఎయిర్ క్వాలిటీ  ఇండెక్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈరోజు ఉదయం వర్షం కురవడం దానికి తోడు  మంచు, దుమ్ము తో కూడిన  వాతావరణం వల్ల  విజిబులిటీ  బాగా తగ్గిపోవడంతో  మ్యాచ్ జరుగడం  అనుమానంగానే  మారింది.  మరో రెండు గంటల్లో ఈ మ్యాచ్ గురించి స్పష్టత రానుంది. 




ఇదిలావుంటే  దీపావళి తరువాత ప్రస్తుతం  ఢిల్లీలో  వాయు కాలుష్యం  ప్రమాద కర స్థాయికి  చేరుకుంది.  దాంతో  మ్యాచ్  ను వేరే చోటికి  తరలించాలని  పర్యావరణ  వేత్తలు కొద్దీ రోజుల క్రితం   గంగూలీకి లేఖ  రాసిన విషయం తెలిసిందే.  అయితే  ఓ సారి షెడ్యూల్ ఫిక్స్ చేశాక  చివరి నిమిషంలో మ్యాచ్ ను  రద్దు చేయలేం. గ్రౌండ్ సిబ్బంది తో మాట్లాడం  జరిగింది. సూర్యడు   ఉదయిస్తే  మ్యాచ్ కు ఎలాంటి ఆటంకం  ఉండదని వారు  హామీ ఇచ్చారు.  దాంతో   మ్యాచ్ ను అక్కడే జరుపాలని నిర్ణయించామని గంగూలీ అన్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే గంగూలీ ఆశించినట్లుగా  మ్యాచ్ జరిగే  అవకాశం కనిపించడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: