భారత క్రికెట్ కి గౌతమ్ గంభీర్ చేసిన సేవలు అన్ని ఇన్నీ కావు. తన బ్యాటింగ్ తో ఎన్నో సార్లు భారత్ ని గట్టెక్కించాడు. భారత్ ధోనీ సారథ్యంలో ప్రపంచకప్ గెలవడంలో గౌతమ్ గంభీర్ ది కీలక పాత్ర అని అందరికీ తెలుసు. ఆ రోజు గౌతీ లేకపోతే ఆ మ్యాచ్ గెలిచి ఉండేవాళ్లం కాదని చాలా మంది అభిప్రాయం. అయితే అంతటి ఆటగాడు సడెన్ గా ఆటనుండి తప్పుకోవడం అతని అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. 

 

క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ రిటైర్ మెంట్ తీసుకున్న గౌతమ్ ప్రస్తుతమ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరపున పార్లమెంట్ అభ్యర్థి గా నిలబడి ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ఎన్నికయ్యాడు. రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న గౌతీకి క్రికెట్లో అరుదైన గౌరవం దక్కింది. సాధారణంగా పేరు పొందిన క్రికెట్ మైదానాలకి గానీ, మైదానంలో స్టాండ్స్ కి గానీ క్రికెటర్ల పేరు పెట్టడం ఆనవాయితీ.

 

మైదానంలోని స్టాండ్స్ కి వారి పేర్లు పెట్టి వారిని గౌరవిస్తుంటారు. అలాంటి గౌరవం గౌతీకి కూడా దక్కనుంది.  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఒకానొక స్టాండ్ కి గౌతమ్ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలన్నీ పూర్తయ్యాయని సమాచారం. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే అదే స్టేడియంలో ఒక స్టాండ్ కి భారత కెప్టెన్ కోహ్లీ పేరు పెట్టడం జరిగింది.

 

దీనికి సంబంధించిన వేడుక కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం మరో స్టాండ్ కి గౌతీ పేరును పెట్టాలని అనుకుంటున్నారు. ఈ విషయమై కార్యదర్శి రాజన్ మాట్లాడారు. టీమిండియాకి గౌతమ్ చేసిన సేవలని గుర్తించి, గౌరవించాలనే ఉద్దేశ్యంతోనే స్టాంద్ కి గౌతమ్ పేరు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పారు. వచ్చే రంజీ ట్రోఫీ నుండీ ఈ స్టాండ్ అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: