ఎం‌ఎస్ ధోని అంటేనే దనదన్ క్రికెట్ కు పెట్టింది పేరు. ఎవరికి సాధ్యం కానీ షాట్స్ ఆడుతూ మెరుపు ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు. అలాంటి దనదన్ మెరుపులను ప్రస్తుతం క్రికెట్ అభిమానులు మిస్ అవుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ధోని అదే హెలికాప్టర్ షాట్స్ ఇతర ఆటగాళ్లు ఆడడం చాలా అరుదు. ఒక్క ధోనీకి మాత్రమే సాధ్యమైన ఆ కళాత్మక శాట్ ను తాజా మరో క్రికెటర్ ఆడి ధోనీకి గుర్తు చేశాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని తరహాలో బరోడా బ్యాట్స్‌మన్‌ విష్ణు సోలంకి చివరి బంతికి హెలికాప్టర్‌ సిక్స్‌ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

 వివరాల్లోకి వెళితే..ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా జరుగుతున్న క్వాటర్ ఫైనల్స్ లో బరోడా, హర్యానా జట్ల మద్య జరిగిన మ్యాచ్ అనుక్షణం ఉత్కంఠ తో సాగింది. ఇన్నింగ్స్‌ చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడుతూనే వచ్చింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బరోడా జట్టు ఆరంభం ఆరంభం నుండి ధాటిగా ఆడడం ప్రారంభించింది.

ఈ క్రమం లో  ఓపెనర్‌ స్మిత్‌ పటేల్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 46 బంతుల్లోనే 71 పరుగులతో వీరవిహారం చేశాడు.  ఇక సోలంకి ధాటికి అలవోకగా గెలిచే అవకాశం ఉన్న హర్యానా జట్టు బౌలర్ మోహిత్ శర్మ 19వ ఓవర్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో..విజయం ఇరు జట్లను దొబుచులాడింది. ఈ క్రమం లో విష్ణు సోలంకి లాస్ట్ బాల్‌లో ధోనిని గుర్తు చేసేలా హెలికాప్టర్‌ సిక్స్‌తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: