నిన్న రాత్రి జరిగిన ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మొదటి వన్ డే లో అనూహ్యంగా ఇండియా ఓటమి పాలయింది. ఈ విషయాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. వర్షం కారణంగా 50 ఓవర్ల ఆట కాస్త... 40 ఒవర్లకు తగ్గించండి జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ధావన్ సేన పవర్ ప్లే లోనే ఓటమిని ఖరారు చేసుకుంది. మొదటి ఎనిమిది ఒవర్ల పవర్ ప్లే లో రెండు కీలక వికెట్లు కోల్పోయి 18 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవానికి ఇక్కడే ఇండియా చేదనలో వెనకబడింది, ఎంతటి స్కోర్ అయినా వికెట్లు చేతిలో ఉంటే సాధించడం సులభమే. కానీ ఇండియా ఓపెనర్ లు ఈ విషయాన్ని గ్రహించలేక ఔట్ అయ్యారు.

కాగా ఆ తర్వాత ఇషాన్ మరియు గైక్వాడ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను భుజానకెత్తుకున్నారు. అయితే వరుస ఓవర్ లలో ఇద్దరూ ఔట్ అయ్యారు. శాంసన్ మరియు శ్రేయాస్ అయ్యర్ మరో వికెట్  పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చినా అర్థ సెంచరీ తర్వాత అనవసర షాట్ కు పోయి శ్రేయాస్ ఔట్ అయ్యాడు. శాంసన్ మరియు శార్దూల్ ఠాకూర్ లు ఇన్నింగ్స్ ను స్టెఢీ చేశారు. ఒక దశలో ఓవర్ కు పదికి పైగా పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ శార్దూల్ చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలిచేది.. కానీ భారీ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. అప్పటికే కొట్టాల్సిన  స్కోరింగ్ రేట్ పెరిగిపోయింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడిన దశలో ఆవేష్ ఖాన్ స్ట్రైకింగ్ కి వచ్చాడు.  ఆ సమయంలో 12 బంతులకు 37 పరుగులు చేయాల్సి ఉంది.

కానీ 39 వ ఓవర్ లో స్త్రైక్ లో  ఉన్న ఆవేశ్ ఖాన్ వరుసగా రెండు బంతులను డాట్ చేశాడు. మళ్లీ మూడవ బంతికి 2 పరుగులు చేశాడు. నాలుగవ బంతి మళ్లీ డాట్... అయిదవ బంతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.  అలా కీలకం అయిన 39 ఓవర్ లో శాంసన్ కి స్ట్రైక్ ఇవ్వకుండా .. అయిదు బంతులను ఆడి 2 పరుగులు మాత్రమే చేసి ఇండియా గెలుపు అవకాశాలను దెబ్బ తీశాడు.  ఒకవేళ సంజు కు మొదటి బంతికి సింగిల్ తీసి... స్త్రైక్ ఇచ్చి ఉంటే... ఆ ఓవర్ లో కనీసం 10 పరుగులు వచ్చినా... తర్వాత ఓవర్ లో ఈజీ అయి ఉండేది. ఇక శాంసన్ కూడా మొదటి నుండి నెమ్మదిగా ఆడినా.. కుదురుకున్నాక కూడా నెమ్మదిగా ఆడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆఖరి 5 ఓవర్ లలోనూ ఫాస్ట్ గా ఆడలేదు.. కేవలం చివరి ఓవర్ లో మాత్రమే కొంచెం వేగంగా ఆడాడు..అది కూడా స్పిన్ బౌలింగ్. ఇలా ఇండియా ఓటమిలో సంజు మరియు ఆవేశ ఖాన్ లు కారణం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: