అబ్బబ్బబ్బ... బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్...... ఎంటర్టైన్మెంట్ అంటేనే బిగ్ బాస్...... ఇదండీ సంగతి...!!! బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో ఏడో వారాంతం చూసిన వారెవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. సరదాలు, సందడులు ఆటపాటలతో అలరించారు మన బిగ్బాస్ ఇంటి కంటెస్టెంట్ లు. సీజన్ ఫోర్ లో హంగామా కాస్త ఎక్కువగానే ఉంది..... ఇంటి సభ్యులు వారి క్రేజును అంతకంతకు డబుల్ చేసుకుంటున్నారు.

బ్లాక్‌బస్టర్ టాస్క్‌కు కొనసాగింపుగా జరిగిన అవార్డు ఫంక్షన్లో సెలబ్రిటీలందరూ అందంగా హుషారుగా బొమ్మ  దద్దరిల్లేలా సందడి చేశారు. బీబీ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అలనాటి ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు చిత్రంలోని ఆరేసుకోబోయే పారేసుకొన్నాను పాటకు సోహైల్, మోనాల్ కలిసి డ్యాన్స్ చేసి మతి పోగొట్టారు. తర్వాత బంగారు బుల్లోడు చిత్రంలో బాలకృష్ణ, రవీనాటాండన్ స్టెప్పులు వేసిన స్వాతిలో ముత్యమంత పాటకు అవినాష్, అరియానా స్టేజ్ దద్దరిల్లేలా స్టెప్పులు వేశారు.తర్వాత దసరాబుల్లోడు చిత్రంలో చెంగాబి రంగు చీర కట్టుకొన్న చిన్నది పాటకు దివి, అమ్మ రాజశేఖర్ జత కట్టి..... సూపర్ అనిపించేలా డ్యాన్స్ చేశారు. దివి హొయలు ఒలకబోయగా.. అక్కినేని స్టైల్లో అమ్మ రాజశేఖర్ వాహ్వా అనిపించారు. వారిద్దరి స్టెప్పులు వేస్తున్నంత సేపు ఇంటి సభ్యులు చప్పట్లు, ఈలలతో  హోరెత్తించారు.. అంతగా అలరించారు.

ఈవారం షో లో నాగార్జున ఆయన షూటింగ్ పనులలో బిజీగా ఉన్న కారణంగా..... రేపటి ఎపిసోడ్ లో బిగ్బాస్ స్టేజి పై సమంత సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ వారం అందరికంటే  తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా దివి ఎలిమినేట్ కానున్నారని సామజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే వాస్తవానికి మోనాల్ కి తక్కువ ఓట్లు రాగా...మరో సారి బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను సేవ్ చేసిందని విమర్శకులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి రేపటి ఎపిసోడులో ఏమి జరిగిందో వేచి చూడాలి.  
   

మరింత సమాచారం తెలుసుకోండి: