సముద్రపు అలలు నీలం రంగులో ఉండటం మనం చూసే ఉంటాము..ఆకాశం, సముద్రం ఒకే కలర్ లో ఉండటం తెలుసు..అయితే కొన్ని సముద్రాలు ఎరుపు, నీలం రంగులో ఉండటం అరుదుగా చూసే ఉంటాము..అలాంటి దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు..ఆ ప్రాంతాలకు సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటి దృశ్యం సందడి చేస్తుంది..గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో భారీ ఎత్తున వరద నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద నీరు సముద్రంలోకి చేరుతోన్న క్రమంలో సముద్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది..


ఆ అద్భుత దృశ్యం మరెక్కడో కాదు..ఆంధ్ర ప్రదేశ్ లోనే వెలుగు చూసింది..రాష్ట్రంలోని కాకినాడలోని ఉప్పాడ సముద్ర తీరంలో కనిపించిన దృశ్యం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తూర్పు తీర ప్రాంతానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో బురద నీరుతో నీలి సముద్రం కాస్త ఎర్ర సముద్రంగా మారింది..వరద నీరు ఎక్కువగా రావడం తో నీళ్ళు రెండు రంగులలొ కనువిందు చేశాయి.బురద నీరుతో కెరటాలు ఉప్పొంగుతున్నాయి. సముద్ర తీరంలో అలలు ఎర్రగా మారి ఎగిసిపడుతున్నాయి. అయితే సముద్రం లోపల మాత్రం సముద్రం నీలి రంగులోనే ఉంది. దీంతో ఎరుపు, నీలి రంగుతో సముద్రంలో అద్భుత దృశ్యం కనిపిస్తోంది.


వరద నీరు సాగర జలాల తో పూర్తిగా కలవడానికి కొంత సమయం పడుతుందని స్థానికంగా ఉన్న మత్స్య కారులు చెబుతున్నారు. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు సముద్ర తీరం లో వేర్వేరు రంగుల్లో ఉన్న గోదావరి, సముద్రం జలాలు కనువిందు చేస్తున్నాయి. వీటిని కొందరు తమ కెమెరా ల్లో బంధించి సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేస్తున్నారు.. అవి కాస్త చూపరులను తెగ ఆకట్టుకుంటుంది..ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి కొత్త నీళ్లతో జల కల సంతరించుకుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: