దేశీయ విమానాలలో సీట్ల పరిమితి కుదించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను ఎత్తివేసింది. 100% సీట్లతో ప్రయాణించవచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం వెలువడిన ఓ ప్రకటనలో తెలిపింది . గత మే 2020 నుండి దేశీయ విమానాలలో సీట్లను 80 % వరకు కుదించగా తాజాగా ఈ నిర్ణయాన్ని 100% పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా తగు జాగర్తలతో నడుపుకోవచ్చని తెలిపింది.




 ఈ సందర్భంగా విమానాలలో పార్లమెంటు సభ్యులకు గౌరవపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు మరియు ఎయిర్ లైన్స్ కి సర్క్యులేషన్ పంపింది. ఈ నిబంధనలు అక్టోబర్  18 వ తారీఖు నుండి అమలు కానున్నాయని తెలియజేసింది. అయితే ఇప్పటికే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎయిర్ ఇండియాను అరవై ఎనిమిది సంవత్సరాల తరువాత 18000 వేల కోట్ల బిడ్డింగ్ వేసి తిరిగి పొందింది. అయితే 100 శాతం సీటింగ్ టాటా కంపెనీకి ఇప్పుడు కలసి వచ్చే శుభపరిణామం

మరింత సమాచారం తెలుసుకోండి: