కొవిడ్ ఉధృతి నెమ్మ‌దిగా పెరుగుతూ వ‌స్తోంది. ప్ర‌పంచంలోని ప‌లుదేశాల‌పై ఈ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ఈనెల 28వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధించ‌నున్నారు. ర‌ష్యాలో శుక్ర‌వారం ఒక్క‌రోజే దాదాపు 40వేల కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఎక్క‌డిక‌క్క ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేయాల‌ని అధ్య‌క్షుడు పుతిన్ అధికారుల‌ను ఆదేశించారు. వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఈరోజు నుంచే లాక్‌డౌన్ విధించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా ఈనెల 30వ తేదీ నుంచి వ‌చ్చేనెల ఏడోతేదీ వ‌ర‌కే కార్యాల‌యాల‌న్నింటినీ మూసేయ‌నున్నారు. శుక్ర‌వారం ఒక్క‌రోజు కొవిడ్ ధాటికి వెయ్యికి పైగా మ‌ర‌ణించ‌డంతో ర‌ష్యాలో ఇప్ప‌టివ‌ర‌కు ఆ మ‌హమ్మారికి బ‌లైన‌వారి సంఖ్య 2 లక్ష‌ల 28వేల‌కు చేరింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌రకు కేవ‌లం 45 శాతం మందికే టీకాలు అందాయి. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని పుతిన్ ఆదేశించారు. ర‌ష్యాతోపాటు ఉక్రెయిన్‌, రుమేనియా, ఆర్మేనియా దేశాల్లో కూడా కొవిడ్ క‌ల్లోలం సృష్టిస్తోంది. యూర‌ప్ దేశాల్లో ఆర్మేనియా త‌ర్వాత టీకా కార్య‌క్రమం అత్యంత మంద‌కొడిగా జ‌రుగుతోంది ఒక్క ఉక్రెయిన్‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: