సీఎం జగన్ తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడమే తమకు దిక్కని వాపోతున్నారు. మరేం చేయాలో అర్థం కావట్లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు ప్రధానమైన సమస్య విద్యుత్ అంటున్నారు. గతంలో 80శాతంపైగా ట్రాన్స్ఫార్మర్లను ఉచితంగా అందిస్తే మూడున్నరేళ్లుగా మిగిలిన 20శాతం ఏర్పాటు చేయలేదని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్ ఫార్మర్లు మరమ్మత్తులకు గురైతే పట్టించుకునే నాథులు కూడా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


అర్థం కాని విధంగా రైతులపై విద్యుత్ బిల్లులు భారం మోపుతున్నారని ఆక్వా రైతులు అంటున్నారు. ఆక్వా మేతకు కీలకమైన సోయా ధర తగ్గుతుంటే..., మేత ధరలు పెరగుతోందన్నారు. గతంలో 30వేలు వచ్చే విద్యుత్ బిల్లు, ఇప్పుడు లక్షల్లో వస్తోందంటున్నారు. రొయ్యల్ని కొనే నాథులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లకు డబ్బులు వసూలు చేస్తున్నా సరైన సమయానికి విద్యుత్ ఇవ్వట్లేదని బాధపడుతున్నారు. ఆక్వా ఫీడ్ భారీగా పెరిగిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జగన్ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: