ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక బ్రెజిల్లో అయితే రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా  ప్రజల్లో పెరిగిపోతూనే ఉంది. ఇక తాజాగా బ్రెజిల్  కరోనా  వైరస్ తీవ్రత గురించి జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సంచలన విషయాలను చెప్పింది. దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తాయి అంటూ తెలిపింది జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం. 

 


 ఇప్పటికే బ్రెజిల్లో మరణాల సంఖ్య 34, 021 గా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ రెండవ స్థానంలో యునైటెడ్ కింగ్డం ఉన్నాయి. ఇక మరణాల సంఖ్య ఏకంగా ఇటలీ దేశాన్ని సైతం దాటిపోతుందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది కరోనా వైరస్ భయం తో బతుకుతున్న విషయం తెలిసిందే. అక్కడ రోజుకు వందల్లో  మరణాల సంఖ్య సంభవిస్తున్నాయి. .

మరింత సమాచారం తెలుసుకోండి: