కొంత‌కాలంగా భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఇరు దేశాల సైనికులు ప‌లుమార్లు ఘ‌ర్ష‌ణ‌కు కూడా దిగిన విష‌యం తెలిసిందే. త‌రుచూ చైనా బ‌ల‌గాలు భార‌త భూభాగంలోకి చొర‌బ‌డుతూ ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నాయి. అంతేగాకుండా.. ప‌క్క‌నే ఉన్న నేపాల్‌ను కూడా భార‌త్‌పైకి రెచ్చ‌గొట్టేందుకు చైనా ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇటీవ‌ల ఈ విష‌యంపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా స్పందించారు.

 

అయితే.. తాము చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటామ‌ని, మ‌ధ్య‌లో మూడో వ్య‌క్తి అవ‌స‌రం లేదంటూ చైనా ట్రంప్‌పై మండిప‌డింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతపై నేడు కీలక చర్చలు జ‌రుగ‌బోతున్నాయి. తొలిసారిగా ఇరు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్ స్థాయి ర్యాంకు అధికారుల సమావేశం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. చుసుల్‌-మోల్డో సరిహద్దు వద్ద భేటీ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: