వరద సాయంలో పారిశ్రామిక వేత్తల తీరు పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.  విదేశాల్లో పారిశ్రామికవేత్తలు తమ ఆస్తులను... తమ సంపదకు కారణమైన ప్రజలకి, సమాజానికి ఉదారంగా ఇస్తున్నారు అని అన్నారు. మన దగ్గర ఉన్న పారిశ్రామికవేత్తల్లో అంత ఉదారత కనిపించదు. కారణం ఏమిటి?  అని ఆయన ప్రశ్నించారు. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు  చదివి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకొనేవారికి అమెరికా వంటి దేశాల్లో వ్యవస్థలు బాగా సపోర్టు చేస్తాయి అని అన్నారు.

 అందుకే వాళ్లు వ్యవస్థకు ఏదైనా చేద్దామని ముందుకు వస్తారు అన్నారు. ఇక్కడ కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు వ్యవస్థలకు చాలా చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అయితే విదేశాల్లో ఉన్నంత ఉదారత ఇక్కడ ఎందుకు కనిపించదో లోతుగా విశ్లేషణ జరగాలన్నారు.  అక్కడి వారితో పోల్చితే ఇక్కడ పారిశ్రామికవేత్తలది తప్పని నేను మాట్లాడనన్నారు. ఎందుకంటే వారికున్న సాదకబాధకాలపై వారితో మాట్లాడితే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: