భార‌త్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ మ‌రేదానికి ఉండ‌దు. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నేడు మాత్రం అమాంతం పెరిగింది. దేశంలో పసిడి ధర పరుగులు పెడుతోంది. గత నెలలో భారీగా దిగివచ్చిన పసిడి ఇప్పుడు రోజురోజుకు పెరుగుతూ.. బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది. తాజాగా శనివారం 10 గ్రాములపై రూ.510 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,290 వద్ద కొనసాగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: