కోవిడ్ అలెర్ట్ : టీకా  స్థానంలో టాబ్లెట్

ప్రపంచాన్ని కుదిపి వేస్తున్న కోవిడ్ -19 ను అదుపు చేసేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే... ప్రంపంచ వ్యాప్తంగా టీకా విషయంలో నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, టీకా స్థానంలో మాత్ర , ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది.  ఇది త్వరలో భారత మార్కెట్ లోకి రానుంది. కోవిడ్ మహమ్మరి తీవ్రతకు అడ్డుకట్టవేసేందుకు యాంటీ వైరల్ ట్యాబ్లెట్ ను అందుబాటు లోనికి తీసుకురానున్నట్లు మెర్క్ అండ్ కో ఫార్మా సూటికల్ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ అమెరికాలోని ఔషధ కంపెనీలలో పేరెన్నిక గన్నది. ఈ కంపెనీ  చాలా కాలంగా కోవిడ్-19 పై పరిశోదనలు జరుపుతోంది.

 తాజాగా  కరోనా వైరస్ లోని జన్యు కోడ్ ను మార్పు చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించ వచ్చని కనుగొనింది. తమ ప్రయోగశాలలో సాధించిన ఫలితాలను  ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో  ఈ ఔషధం  తయారీకి రంగం సిద్ధమైంది.  ఈ ఔషధానికి 'మాల్నుపిరవీర్' గా పేరు పెట్టారు అక్కడి శాస్త్రవేత్తలు.  ఇది ప్రపంచంలోని అన్ని కంపెనీలుతయారు చేసే టీకా కాదు. మందు గుళిక, యాంటీ వైరల్ ఔషధం. నూతనంగా రూపొందిన ట్యబ్ లెట్. దీనిని వేసుకుంటే కరోనా వ్యాధి బారిన పడిన వారు ఆసుపత్రుల గడప తొక్కల్సిన అవసరం చాలా మటుకు తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మృత్యవాత పడే అవకాశాలు ఉండకపోవచ్చనేది వారి భావన. ప్రపంచ వ్యాప్తంగా మానవాళి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ పై పోరు లో భాగంగా జరుగుతున్న చికిత్సలలో ఇది నూతన  ఆవిష్కరణ.  ఈ సరికొత్త ఔషధం అందుబాటులోకి వస్తే వోరల్ యాంటీ వైరల్ ఔషధం ఇదే అవుతుంది. అంటే నోటి ద్వారా తీసుకునే ఔషధం. ఇది అంబుటు లోకి వస్తే ఇంజక్షన్ అంటే భయపడే వారకి చాలా ఉపయుక్తమవుతుంది.  మెర్క్ అండ్ కో ఫార్మా సూటికల్ కంపెనీ ఇప్పటికే భారత్ సహా పలుధేశాలతో చర్చలు జరుపుతోంది. అత్యవసర వినియోగం జాబితాలో  ఈ టాబ్లేట్ చార్చాలని కోరింది. ప్రభుత్వ ఆమెద ముద్ర లభిస్తే కోవిడ్ టీకా స్థానంలో టాబ్లెట్ చేరే అవకాశం ఉందని వైద్య, ఆర్థిక రంగపరిశోధకులు పేర్కోంటున్నారు.















































































































































































































 

-----
 


మరింత సమాచారం తెలుసుకోండి: