రాకేష్ ఝున్ ఝున్ వాల్, ఈ పేరు బాగా వినేదే. ఈయన ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. తాజాగా ఈయన గత రెండు రోజులుగా ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో వరుసగా భేటీ అయ్యారు. ఈయన వెంట మరో ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళతో భేటీ అనంతరం ఇద్దరు సదరు ఫోటోలను సామజిక మాధ్యమాలలో పంచుకున్నారు. కానీ ఈ భేటీకి సంబందించిన వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. అయితే మోడీని కలిసినప్పుడు మాత్రం ఆయన కుర్చీలో కూర్చొని ఉండగా, మోడీ మాత్రం చేతులు కట్టుకొని నిల్చొని ఉన్నారు. అయితే ఆయన చిన్నవారు కాబట్టి అలా వినయంగా ఉన్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతేనా కార్పొరేట్ వాళ్ళ ముందు మోడీ ఇంతేనా అంటూ ఇంకొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి.

ఇక రాకేష్ గారు ఈ వరుస భేటీల గురించి మాత్రం ఎక్కడ సమాచారం బహిర్గతం అవకుండా చూసుకుంటున్నారు. సతీమణి సమేతంగా మోడీ, ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు ఏమి మాట్లాడుకుంటారు, వ్యాపారం తప్ప అంటున్నారు నిపుణులు. వ్యాపారం అంటే గుర్తొచ్చింది, రాకేష్ గారు త్వరలో ఆకాశ పేరుతో సరికొత్త ఎయిర్ లైన్స్ సేవలు ప్రారంభిస్తున్నారు. దానికి అనుమతులు సరిగ్గా రావటంలేదని దాని గురించి మాట్లాడటానికి వచ్చి ఉండవచ్చు, లేదా ఆ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించడానికి కూడా అయి ఉండవచ్చు అంటున్నారు కొందరు. ఇవన్నీ నెట్ ఇంట్లో మాటలే. రాకేష్ గారి ఢిల్లీ పర్యటన కూడా ఈ వ్యాపార కార్యకలాపాల గురించే ఉంటుంది అని వారు అంటున్నారు.

ఇక్కడ రాకేష్ గారు ఇద్దరు ప్రముఖులను కలిశారు అనేది వార్త కంటే ప్రధాని వినయంగా నిలుచోవడం, అదికూడా చేతులు కట్టుకొని నిలుచోవడం పెద్ద వార్త అవుతుంది. ఆయన గురించే ఈ వార్త నెట్ లో హల్ చల్ అవుతుంది కానీ రాకేష్ గారి గురించి ఆయన వ్యాపారాల గురించి తక్కువే. ప్రధాని నిజంగా వినయంగానే ఉన్నాడా లేక కార్పొరేట్ల దగ్గర ఆయన పరిస్థితి అందరికి విన్నవించుకుంటున్నాడా లేక ఆయన వినయంగా ఉండటం ఎలాగో చూపిస్తున్నారా అంటూ అనేక ఛలోక్తులు ఈ ఫోటోల మీద పేలుతున్నాయి. వ్యాపార సరళీకరణ కింద వచ్చిన వారికి స్వాగతం ఎలా చెప్పాలో నేర్పిస్తున్నట్టు ఉన్నారు అని కూడా అంటున్నారు కొందరు. ఈ కామెంట్స్ తో, అసలు భేటీ ప్రాధాన్యత పక్కదారి పట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: