మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. అప్పటివరకు సంతోషంగా గడిపిన క్షణాలే విషాద ఛాయలను నింపుతున్నాయి. తాజాగా ఓ యువతీ బాక్సింగ్ మ్యాచ్ కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుదుచ్చేరిలో ప్రస్తుతం బాక్సింగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు కోయంబత్తూరు నుంచి అమృత(19), భూమతి(19) అనే విద్యార్థినులు తమ కోచ్ సర్వేశ్వరన్ (25)తో కలిసి పుదుచ్చేరికి వెళ్లారు. ఇక వారు పనిలో పనిగా పుదుచ్చేరిలో ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లను చూడాలని అనుకున్నారు.

అయితే డిసెంబర్ 8న సాయంత్రం 4 గంటల సమయంలో బీచ్‌కు వెళ్లారు. ఇక ముగ్గురూ బీచ్‌లో దిగి ఎంజాయ్ చేస్తుండగా ఉధృతంగా వచ్చిన ఓ అల వారిని సముద్రంలోకి లాక్కెళ్ళింది. అక్కడ వాళ్లను చూసిన వారు కాపాడాలంటూ గట్టిగా కేకలు వేయడంతో.. వెంటనే స్థానికులు కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లారు. అందులో కోచ్ సర్వేశ్వరన్, విద్యార్థిని అమృతను ఒడ్డుకు తీసుకొచ్చారు.

కాగా.. మరో యువతి భూమతి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె కోసం చాలా సేపు వెతుకులాట సాగించగా.. ఆమె అపస్మారక స్థితిలో కనిపించడంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భూమతిని పరిశీలించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లుగా తెలిపారు. యువతీ చనిపోయిందన్న సంగతి తెలిసి విద్యార్థినుల రోదనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇక బాక్సింగ్ మ్యాచ్‌లో పాల్గొనడానికని వస్తే ఇలా ఊహించని విధంగా ప్రాణాలు పోవడంతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు స్పందిస్తూ.. మరీ అంత లోతుకు కూడా వెళ్లలేదని.. అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఇక ఏదేమైనప్పటికీ  బంగారం లాంటి భవిష్యత్ కళ్ల ముందు ఉన్న ఈ యువతి అకాల మరణం కన్నవారికి కడుపుకోతను మిగిల్చిందనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: