ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్లకు శుభవార్త అందింది.DCIO ఇంకా ఇతర పోస్టుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు సెప్టెంబర్ 30, 2021. అలాగే UPSC అధికారిక వెబ్‌సైట్ అయిన upsc.gov.in ద్వారా అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అలాగే పూర్తిగా సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తును ప్రింట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 1, 2021 అని కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి లేట్ చెయ్యకుండా వెంటనే దరఖాస్తు చేస్కోండి.

UPSC రిక్రూట్‌మెంట్ 2021 ఖాళీలు...

రీజనల్ డైరెక్టర్ - 1 పోస్ట్

డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ - 10 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ)- 1 పోస్ట్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) - 1 పోస్ట్

ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) - 2 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజిన్./కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) - 1 పోస్ట్.

అసిస్టెంట్ ప్రొఫెసర్ (గణితం)- 1 పోస్ట్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (తయారీ ఇంజినీరింగ్/ ప్రొడక్షన్ ఇంజిన్)- 1 పోస్ట్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెకానికల్ ఇంజినీరింగ్) - 1 పోస్ట్

సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్- II ((ఎలక్ట్రానిక్స్)- 3 పోస్టులు

జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ - 3 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్/అసిస్టెంట్ సర్వేయర్ - 3 పోస్టులు

UPSC రిక్రూట్‌మెంట్ 2021: అప్లికేషన్ ఫీజు అభ్యర్థులు sbi లోని ఏ శాఖలోనైనా నగదు ద్వారా లేదా sbi  నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించి లేదా వీసా/మాస్టర్ క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించి రూ .25 రుసుము చెల్లించాలి. SC/ST/PwBD/ఏ కమ్యూనిటీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.కాబట్టి అర్హత వున్న అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. నిరుద్యోగులకు ఇదొక చక్కటి అవకాశం. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: