కోడిగుడ్డుమీద ఈక‌లు లాగే బ్యాచ్‌! అని ఇటీవ‌ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల‌ను, వారిని స‌మ‌ర్ధించే ఓ వ‌ర్గం మీడియాను సోష ల్ మీడియాలో జ‌నాలు ఆడిపోసుకున్నారు. అయితే, దీనిని మొద‌ట్లో చాలా మంది ప‌ట్టించుకోలేదు. స‌హ‌జంగానే జ‌గ‌న్ అధికా రంలోకి రావ‌డం ఇష్టం లేదుకాబ‌ట్టి ఇలా.. వ్య‌తిరేక వార్త‌లు, క‌థ‌నాలు ప్ర‌చారం, ప్ర‌సారం చేస్తార‌ని అనుకున్నారు. మ‌రీ ముఖ్యం గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు న్యాయ‌స‌మీక్ష‌కు నిల‌బ‌డ‌క‌పోవ‌డం, త‌ర్వాత జ‌గ‌న్ త‌న‌దైన పంథాలో నిర్ణ‌యాల‌ను మార్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌డాన్ని కూడా టీడీపీ నేత‌లు వితండ‌వాదంతో త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో ఏడాది కాలంలో వీటిని ప‌రిశీలించిన సోష‌ల్ మీడియా జ‌నాలు.. ఆ పేరే పెట్టారేమో .. అనిపిస్తుంది.

 

తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కేసు విష‌యంలోనూ టీడీపీ స‌హా.. దానికి మ‌ద్ద‌తిచ్చే ఓ వ‌ర్గం మీడి యా విప‌రీత‌మైన ప్ర‌చారం చేసింది. ఇంకేముంది.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టులో మ‌రోసారి మొట్టికాయ‌లు ప‌డ్డాయ‌ని, ఎదు రు దెబ్బ‌త‌గిలింద‌ని, ఇలా త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి ఇటీవ‌ల ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వేసిన రంగుల విష‌యంలో సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును ఆపేది లేద‌ని చెప్ప‌డాన్ని కూడా జ‌త‌క‌లిపారు. మొత్తంగా తాజా తీర్పును త‌మ‌దైన శైలిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏకేసేందుకు బాగానే వినియోగించుకున్నారు. దీంతో అంద‌రూ .. నిజంగానే తాజాగా నిమ్మ‌గ‌డ్డ తీర్పులో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌త‌గిలింద‌ని అనుకున్నారు.

 

కానీ, వాస్త‌వంగా సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల‌ను(తీర్పుకాదు) గ‌మ‌నిస్తే.. ఇటు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు కానీ, అటు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌కు ఊర‌ట కానీ ఎక్క‌డా క‌ల‌గ‌లేదు. తాజాగా ఈ కేసు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై స్టే ఇవ్వాల‌ని సుప్రీం కోర్టును కోరింది. అయితే, స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమ‌తించ‌లేదు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం లేవ‌నెత్తిన అంశాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. నిమ్మ‌గ‌డ్డ‌కు నోటీసులు జారీ చేసింది. అదేస‌మ యంలో ఈ కేసులో ప్ర‌తివాదులుగా ఉన్న వారికి కూడా నోటీసులు జారీ చేసింది. ఇక‌, నిమ్మ‌గ‌డ్డ విష‌యానికి వ‌స్తే.. ఎలాగూ స్టే ఇవ్వ‌డం లేదు కాబ‌ట్టి.. త‌న‌ను కొన‌సాగించేలా ఉత్త‌ర్వులు ఇవ్వాల‌న్న ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

 

రెండు వారాలు అంద‌రూ ఈ విష‌యంలో మౌనంగా ఉండాల‌ని.. రెండు వారాల త‌ర్వాత పూర్తిగా విచారించి ఆదేశాలు జారీ చేస్తామ‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బోబ్డే నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. ఇదీ .. అస‌లు జ‌రిగింది. అంటే.. అటు ప్ర‌భుత్వానికి కానీ, ఇటు నిమ్మ‌గ‌డ్డ‌కు కానీ.. ఊర‌ట ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి మ‌రో రెండు వారాలు ఉంటుంది. కానీ, దీనిని చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేసి.. ప్ర‌తిప‌క్షం.. దాని బాకామీడియా మాత్రం జ‌గ‌న్‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: