కీరాదోస తినడానికి కొంచెం చప్పగా ఉంటుంది. కానీ అందులోకి ఉప్పు, కారం చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎండాకాలంలో ఇవి తినడం వల్ల చలవ చేస్తుంది.అంతేకాకుండా కీర దోసను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా కీర దోసను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఉండే ఖనిజాల లోని ఆల్కలైన్ స్వభావం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.కీరదోస ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                           

 ఎండాకాలంలో వాతావరణం పొడిగా, వేడిగా ఉంటుంది.ఇలాంటి సమయంలో కీరదోస జ్యూస్ను తీసుకోవడం వల్ల చలువ చేసి శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తుంది.

 మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వాళ్ళు వీర దోష ను తీసుకోవడం వల్ల మూత్రపిండంలో రాళ్లు కరిగి పోవడమే కాకుండా మూత్ర విసర్జన సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది.

 కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు కీరదోస జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కీళ్ల లో ఉండే యూరిక్ యాసిడ్ ను తొలగిస్తుంది. ఫలితంగా వాపు, నొప్పి తగ్గుతాయి.అంతేకాకుండా ఆర్థరైటిస్, గౌట్ వంటి వ్యాధులను నయం  చేస్తుంది.

 కీరదోస తీసుకోవడం వల్ల ఎగ్జిమా, తామర,సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు తగ్గడానికి కీరదోస సహాయపడుతుంది.

 కళ్ళు మంటలు, వాపులు ఉంటే కీరదోస ను గుండ్రని ముక్కలుగా కోసి కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్ళు చల్లగా ఉండడమే కాకుండా మంటలు, వాపులు తగ్గుతాయి..

 కీర దోసకాయలు ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.ఇవి బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.అంతేకాకుండా హై బీపీ, లోబిపి నువ్వు కూడా కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.

 కీరదోసకాయలో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కీరదోస లో ఉండే ఔషధాల వల్ల బ్రెస్ట్,యుటేరియన్, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లను నివారించడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: