ఈ రోజుల్లో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది ఎంతో కష్టపడి మేకప్ వేసుకున్న కొద్దిసేపటికే ముఖంపై ఆయిల్ కప్పేసి జిడ్డుచర్మం గా మారుతుంది. తద్వారా ముఖం పై ధూళి కణాలు చేరి చర్మ సమస్యలకు కారణమవుతాయి. ఈ సమస్య ప్రధానంగా హార్మోన్స్ పనితీరు,చర్మంలోనీ నూనె గ్రంథుల పనితీరు,బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి  ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఆయిల్ స్కిన్ తో బాధపడేవారు తమ ఆహారంలో లో కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోరాదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించి ముఖంపై జిడ్డు సమస్య ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆయిల్ స్కిన్ తో బాధపడేవారు ప్రతిరోజు గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.

బాదం పప్పుని నానబెట్టిన తర్వాత పై పొట్టు తీసి పేస్ట్ చెయ్యాలి.అందులో అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసి అరగంట  పాటు ఉంచి కడిగేస్తే చర్మం పై జిడ్డు తొలగి కాంతివంత మవుతుంది.

బయటికి వెళ్లేముందు ఐస్ క్యూబ్ తో ముఖాన్ని మర్దనా చేయాలి. ముఖంపై తడి ఆరిన తరువాత మేకప్ చేసుకుంటే చర్మం జిడ్డవ్వకుండా, ఎక్కువ సేపు తాజాగా మెరుస్తూ ఉంటుంది.

ఆపిల్ ని రౌండ్  ముక్కలుగా కట్ చేసి ముఖంపై 30 పై నిమిషాలు పెట్టుకో వాలి. ఇలా చేస్తే చర్మం మీదుండే జిడ్డు నంతా ఆపిల్ ముక్కలు పీల్చేసి, చర్మాన్ని కాంతివంతంచేస్తుంది.

 స్పూన్ నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడి, ఒక టేబు స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చనినీటితో కడిగేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.

 బొప్పాయిని గుజ్జుగా చేసి అందులో నిమ్మ రసం, అర కప్పుబియ్యం పిండి కలిపి ఈ మిశ్ర మాన్ని ముఖంపై సుతిమెత్తగా మర్దనా చేయాలి. చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.

అరకప్పు పెసర పిండిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నీటినికలిపి ముఖంతో బాటు మెడపై ఇలా చేస్తే నల్లని మచ్చలు తొలగి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

కోడిగుడ్డులోని తెల్లసొనను నిమ్మరసంతో బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్‌ కలవారికి చక్కటి పరిష్కార మార్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: