ఒకప్పుడు దుమ్ము ధూళి నుంచి కాపాడుకోవడానికి మాత్రమే మాస్క్ ఉపయోగించేవారు. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో మాస్క్ అనేది తప్పనిసరి గా మారిపోయింది. ఇక నేటి రోజుల్లో ఇష్టం లేకపోయినప్పటికీ ప్రాణాలను కాపాడుకోవడానికి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వెరసి రోజురోజుకి మాస్క్ వాడకం పెరిగిపోతూనే ఉంది. ఇక ఇప్పుడు ఏం చేసినాఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు తోనే దర్శనమిస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా వ్యక్తులు ముఖానికి మాస్కు పెట్టుకుని కనిపిస్తే కాస్త విచిత్రంగా చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం మాస్క్ లేకుండా ఎవరైనా కనిపించారు అంటే విచిత్రం గా చూడటం మొదలు పెడుతున్నారు అందరు. ఇలా ఒక చిన్న మాస్క్ ఏకంగా ఆరడుగుల మనిషి ప్రాణానికి రక్షణ కల్పించే ఆయుధంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తూ ప్రతి ఒక్కరూ  కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే బాధ్యతాయుతంగా మాస్కు ధరిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఎంతో మంది ఒకే మాస్క్ ఎక్కువ  రోజుల పాటు వాడటం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఓకే మాస్క్ తరచుగా ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


 ఒకే మాస్క్ వేసుకోవడం వల్ల చర్మానికి అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందట.

 ఇక ఒకే మాస్క్ ఉపయోగిస్తే వైరస్ ముఖానికి అంటుకునే ప్రమాదం కూడా ఉంటుందట.

 ఇక అపరిశుభ్రమైన మాస్క్ ను తరచూ ధరిస్తే  బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట.


 ఇక ప్రతిరోజూ మాస్క్ పిండడం వల్ల కూడా మాస్క్ పలచబడి వైరస్ ముప్పు పొంచి ఉంటుందట.

 అందుకే ఒకే సారి వాడి పడేసే సర్జికల్ మాస్క్ లను  ఎంచుకోవడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ కాటన్ మాస్కు వాడితే కేవలం మూడు నుంచి నాలుగు రోజుల వరకు మాత్రమే మాస్క్ ఉపయోగించడం బెటర్ అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: