ప్రతి ఒక్కరూ బ్రతికినంత కాలం సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండాలని ఆశపడతారు. అయితే ఇందులో తప్పేమీ లేకపోయినా కొన్ని సార్లు మనము అనుకున్నట్లు జరిగే ఛాన్స్ ఉండదు. కానీ జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యవంతమైన శరీరం పొందడం అంత కష్టం ఏమీ కాదు. మన శరీరంలో చర్మమే అందరికీ కనబడుతూ మన అందాన్ని తెలియచేస్తుంది. అయితే ఈ చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి చెయ్యాలో చూద్దాం. ముఖ్యంగా ఒక్కో సీజన్ లో ఒక్కో రకమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ శరీరాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలం లో శరీరం ఎక్కువగా పొడి బారుతుంది. శరీరం లో నీటి శాతం బాగా తక్కువైతే చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే ఎండాకాలంలో శరీరానికి తగిన నీటిని అందించే విషయం లో జాగ్రత్త పడాలి. లేదంటే చర్మం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.

చర్మం పొడిబారుతుంది: ప్రస్తుతం చాలా మంది చర్మం పొడిబారడం వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అయితే ఇందుకు ప్రధాన కారణం శరీరం లో తగిన నీటి శాతం లేకపోవడమేనట. అందుకే నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువగా  తీసుకోవాలి.

లిప్స్‌ క్రస్టింగ్: పెదవులు కూడా బాగా పొడిబారుతుంటాయి. స్కాబ్లింగ్ కూడా డీహైడ్రేషన్ చర్మం యొక్క లక్షణం అని నిపుణులు చెబుతున్నారు.  చర్మంపై దురద,పగుళ్లు వంటివి కూడా దీని వలనే వస్తాయట.  అంతేకాదు వయసు పెరిగే సమయం లో చర్మ కాంతి తగ్గడం, ముడతలు వంటివి కూడా శరీరం లోని నీటి కొరత వలనే తలెత్తుతాయి అని నిపుణులు చెబుతున్నారు. అందుకే శరీరానికి తగిన నీటిని అందించాలి. పండ్లు ఎక్కువగా తినడం కూడా శరీరం లో నీటి శాతాన్ని పెంచుతాయి . ఇలా మీరు శరీరానికి తగిన నీటిని అందించగలిగితే మీ చర్మంపై ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: