రావి చెట్టులోని ప్రతి భాగంలో కూడా ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి. రావి చెట్టు వచ్చే గాలి కూడా చాలా శ్రేష్టమైనది.ఈ చెట్టు గాలి పీల్చినా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు చాలా ఈజీగా దూరం అవుతాయి. రాగి చెట్టు చిగుర్లను పాలల్లో ఉడికించి వడకట్టుకుని తాగడం వల్ల మెదడు చాలా చురుకుగా మారుతుంది. ఈ చెట్టు పండ్లను తినడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడి మలబద్దకం సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే రావి పుల్లలతో పళ్ళను శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్లు, దంతాల సమస్యలు చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. దంతాలు ధృడంగా ఇంకా అలాగే చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. రాగి పండ్లను నీడలో ఎండబెట్టి బాగా పొడిగా చేసుకోని ఇక ఈ పొడికి సమానంగా పటిక బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతో పాటు వీర్య వృద్ధి కూడా బాగా జరుగుతుంది.ఇక ఈ పొడిని తీసుకుంటూ రాగి పాలను మీ పాదాలకు రాయడం వల్ల పాదలపగుళ్లు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.


రావి చెట్టు వేర్ల దగ్గర ఉండే మట్టిని తీసుకొని శుభ్రం చేసుకుని పొడిగా చేసి జల్లించి మెత్తని మట్టిని తీసుకొని ఈ మట్టిని స్నానం చేసేటప్పుడు నలుగుగా వాడుతూ ఉంటే చర్మం అందంగా, మృదువుగా ఇంకా అలాగే చాలా కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉండే ముడతలు కూడా చాలా ఈజీగా తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవుతుంది. ఇంకా అలాగే రావి పాలతో కాటుకను తయారు చేసి కళ్లకు పెట్టుకోవడం వల్ల కళ్ల సంబంధిత సమస్యలు కూడా చాలా ఈజీగా పోతాయి.ఇంకా అలాగే కంటి చూపు కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.ఇంకా అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు అలాగే గుండె బలహీనంగా వారు రావి పండ్ల పొడిని 5 గ్రాములు తీసుకుని రెండు కప్పుల పాలల్లో వేసి కలపాలి. తరువాత ఈ పాలను సన్నని మంటపై మూడు పొంగులు వచ్చే దాకా బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ పాలల్లో కండ చక్కెర పొడిని కలుపుకుని క్రమం తప్పకుండా 40 రోజుల పాటు తాగడం వల్ల గుండె చాలా బలంగా ఇంకా అలాగే చాలా ఆరోగ్యంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: