ఒక్కొక్క విటమిన్ కు ఒక్కో ఉపయోగం ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో ఏ విటమిన్ అయినా తక్కువ అయితే సంబంధించిన విభాగంలో ఏదో ఒక నష్టం జరుగుతుంది. అలాంటిదే విటమిన్ ఎ కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ ఎ కొవ్వులో కూడా కరుగుతుంది. మన శరీరంలో జరిగే అనేక రకాల చర్యలకు విటమిన్ ఎ ముఖ్య పాత్ర వహిస్తుంది. విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో సహకరిస్తుంది.. అయితే ఈ విటమిన్ ఎ లోపం వస్తే ఏం జరుగుతుందో..? ఇప్పుడు తెలుసుకుందాం..


విటమిన్ ఎ ఎక్కువగా మాంసం, చేపలు,  గుడ్లు , పాల ఉత్పత్తులలో  ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కూరగాయలు,ఆకుకూరలు  పండ్లలో కెరటోనాయిడ్స్ ఉంటాయి.ఇవి మన శరీరంలో విటమిన్ ఎ ను ఉత్పత్తి చేస్తాయి. చాలామంది ఈ విటమిన్ ఎ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు,శిశువులు,చిన్నారుల్లో ఈ విటమిన్ ఎ లోపం కనిపిస్తోంది..

విటమిన్ ఎ లోపం గల వారిలో కలిగే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చర్మం పొడిబారినట్లు అవుతుంది. విటమిన్ ఎ లోపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఎగ్జిమా లేదా చర్మ సమస్యలు వస్తాయి. ఎగ్జిమా కారణంగా చర్మం పొడిగా మారి, దురదలు పెడుతుంది. అలాగే చర్మం వాపు కు గురి అవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటికీ విటమిన్ ఎ ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.

అలాగే కళ్ళు పొడిబారినట్లు కనిపించడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఈ సమస్య తీవ్రతరం అవుతుందో అప్పుడు అంధత్వం వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి విటమిన్ ఎ లోపం ఉందో లేదో తెలుసుకొని అప్రమత్తం అవ్వాలి. విటమిన్-ఎ లోపం కారణంగా రేచీకటి సమస్య కూడా తలెత్తుతుంది.  కాబట్టి విటమిన్ ఎ కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.


విటమిన్ ఎ లోపం సంతానలేమికి కూడా కారణమవ్వచ్చు. మహిళల్లో విటమిన్-ఎ లోపం ఉంటే పిండం ఎదుగుదల సరిగా ఉండదు. అంతే కాకుండా పుట్టే శిశువులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. మరికొన్ని సమయాల్లో మహిళలకు అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి కావాలి అంటే ఈ విటమిన్ ఎ ఎంతగానో ఉపకరిస్తుంది. కాబట్టి దంపతులిద్దరూ సాధ్యమైనంతవరకూ విటమిన్-ఎ లోపం లేకుండా ఉండేందుకు  ప్రయత్నించాలి.

అంతేకాకుండా చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపం, గొంతు,ఛాతి ఇన్ఫెక్షన్లు, గాయాలు మానడం లో ఆలస్యం అవడం,  ముఖం మీద మొటిమలు రావడం వంటి సమస్యలకు ఈ విటమిన్ ఎ లోపం కారణం కావచ్చు.. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంతవరకు విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: