స‌హ‌జంగా మ‌న జీవ‌న‌శైలిలో ఎక్కువ ప్లాస్టిక్ వాడ‌తాం. అవి ఎంత డేంజ‌రైనా వాటిని మాత్రం వాడ‌కుండా ఉంద‌లేము. ప్లాస్టిక్ మాత్రం భూమిలో ఎన్ని సంవ‌త్స‌రాలు అయినా క‌ల‌వ‌దు. అయితే వారంలో మ‌నిషి స‌మారుగా ఐదు గ్రాములు తీసుకుంటున్నాడ‌ని ఇటీవ‌ల ఒక అధ్యాయ‌నంలో తేలింది. తినే ప‌దార్థాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం మొద‌లు ఇంట్లో వాడే ఏ వ‌స్తువైనా ప్ల‌స్టిక్‌తో చేసింది వినియోగించ‌డ‌మే. ఇది ఎన్నో ర‌కాల అనారోగ్యాల‌కు దారి తీస్తాయి.


ప్లాస్టిక్ కాల్చినపుడు వ్యర్థాలు విష రసాయనాలను వదులుతాయి. వీటితో వన్యప్రాణులు, జలచరాలు, మానవాళి శ్వాసకోశాలు దెబ్బతింటాయి. ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఉపయోగం పెరిగింది. ప్లాస్టిసైజర్లలో కూడా కేన్సర్‌ కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. అందుకే ప్లాస్టిక్ ర‌హిత జీవ‌న‌శైలిని అల‌వాటు చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించండి.


- సౌక‌ర్యంగా ఉన్నాయి క‌దా! అని అంతా ప్లాస్టిక్ సీసాల నీళ్లు తాగ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. కానీ దీర్ఘ‌కాలం వీటిని వాడ‌టం అంత మంచిది కాద‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి.


- ప్లాస్టిక్ క‌ప్పుల్లో టీలు, కాఫీలు తాగే అల‌వాటును మానుకోవాలి. పింగాణి, వెదురు, గాజు క‌ప్పులే ఉప‌యోగించాలి. ఇవి రుచిని పెంచుతాయి.


- వంటింట్లో ప‌ప్పులు, పోపు సామాగ్రిన భ‌ద్ర‌ప‌వ‌చ‌డానికి ఇప్పుడంతా ప్లాస్టిక్ డ‌బ్బాల‌నే వినియోగిస్తున్నాము. వీటి స్థానంలో గాజు, స్టీలు డ‌బ్బాల‌కు వాడడం మంచిది. ఇవి తేమ‌ని ద‌రిచేర‌నివ్వ‌వు.


- కూర‌గాయ‌ల‌ని, పండ్ల‌ను ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో తెస్తుంటాం. ఈ సారి ఎక్క‌డికి వెళ్లినా వెంట నార వ‌స్త్రంతో చేసిన సంచెను ప‌ట్టికెళ్ల‌డం మంచిది. అలాగే ప్లాస్టిక్ స్పూన్లు వాడ‌డం కంటే స్టీలు మ‌రియు చెక్క‌తో చేసిన‌వి వాడ‌డం మంచిది.


- ఇంట్లో జ‌రిగే వేడుక‌ల్లో ప్లాస్టిక్‌ను దూరంగా పెట్ట‌డం మంచిది. చ‌క్క‌గ భోజ‌నాలు అర‌టి అకుల్లో చేయ‌డం చాలా మంచిది.


- అలాగే ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను ఫ్రీజ‌ర్‌లో స్టోర్ చేస్తారు. అది కూడా మంచిది కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు కూర‌గాయ‌లు తెచ్చుకుని వాడుకోవ‌డం చాలా మంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి: