శృంగార కోరికలకు వయసుతో సంబందం లేదు.. టీనేజ్ దాటిన తర్వాత నుండి 60 ఏళ్ళు పైబడిన వ్యక్తి దాకా సెక్స్ శృంగారం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ప్రస్తుతం డేటింగ్ కల్చర్ నడుస్తున్న ఈ రోజుల్లో ఓ 65 ఏళ్ల ముసలోడికి ఆ కోరిక కలిగింది. డేటింగ్ యాప్ డౌన్ లోడ్ చేసి అందులో తనకో అందమైన అమ్మాయి కావాలని డేటా ఇచ్చాడు. అయితే వెంటనే అవతల నుండి ఒక అమ్మాయి స్వీట్ వాయిస్ తో ఫోన్ చేసి డేటింగ్ చేయాలంటే కొంతం మొత్తం చెల్లించాలని చెప్పింది.

 

ఆమె అడిగిందే మొదలు ఆ వ్యక్తి అడిగినంత చెల్లించేశాడు. అయితే చాలారోజులుగా ఆ డేటింగ్ యాప్ నిర్వాహకుల నుండి స్పందన లేకపోవడంతో ఈయనే మళ్లీ ఫోన్ చేయసాగాడు. అయితే అతని వీక్ నెస్ గుర్తించిన వారు అతన్ని బ్లాక్ మెయిన్ చేయడం మొదలు పెట్టారు. ఫోన్ చేసిన ప్రతిసారి ఎంతోకొంత డబ్బు తమ ఎకౌంట్ లో వేయాలని డిమాండ్ చేసేవారు. ఒకవేళ అతను వేయనని అంటే అతని పరువు బజారున పడేస్తాం అని బెదిరించేవారట.

 

ఇలా కొన్నాళ్లు వారి వేధింపులు భరించిన ఆ వ్యక్తి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పటికే వారికి 73 లక్షల దాకా చెల్లించాడట. అయితే పోలీసులు యాక్షన్ లోకి దిగిన తర్వాత సీన్ మొత్తం అర్ధమైంది. ఇంతన్ని కావాలనే ట్రాప్ చేసి డబ్బులు కాజేస్తున్నట్టుగా తెలిసింది. నేవీ ముంబైలో జరిగిన ఈ సంఘటన రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.

 

ఆ ముసలోడి నుండి డబ్బులు కాజేసింది ఓ నలుగురు అమాయిలు ఒక ట్రాన్స్ జెండర్ అని తెలిసింది. వెంటనే వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారట. ఇతనొక్కడే కాదు ఇలా వారు చాలామందికి టోకరా పెట్టారట. డేటింగ్ అని ఆశచూపడం అందమైన అమ్మాయిల ఫోటోలు చూపి లక్షలకు లక్షలు కాజేస్తారట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సఘటనతో అందరు షాక్ అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: