'ఉయ్యాల జంపాల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. తర్వాత చేసిన రెండు వరుస చిత్రాలు సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్‌ సూపర్‌ హిట్‌ అవడంతో రాజ్‌ తరుణ్‌కు తిరుగు లేదనుకున్నారంతా. కానీ కథలు ఎంచుకోవడంలో తప్పటడుగులు వేయడంతో అంతే వేగంగా ఫ్లాప్‌లు నెత్తి మీద పడ్డాయి. అయితే వరసగా ప్లాప్స్ రావడం వల్లనేమో రాజ్ తరుణ్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది అదేంటి అంటే రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని. 

ఆయన ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను అని అన్నారు కానీ ఆయన సన్నిహితులు మాత్రం రాజ్ తరుణ్ ఈ ఏడాది చివరిలోపు పెళ్లి చేసుకుంటాడు అని అంటున్నారు. అయితే రాజ్ తరుణ్ హెబ్బ పటేల్ డేటింగ్ లో ఉన్నారు అని ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త. అయితే ఇప్పుడు ఆమెనే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే తన కొత్త సినిమా "స్టాండ్‌ అప్ రాహుల్‌" తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కి ఓ విజయం చాలా అవసరం. అందుకే ఈ సారి కామెడీని నమ్ముకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో "మిడిల్ క్లాస్ మెలోడీస్" ఫేమ్ వర్షా బొల్లమ్మ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అంచనాలు పెంచారు మూవీ యూనిట్.ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాతో అన్న రాజ్ తరుణ్ హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: