అందానికి సరైన నిర్వచనం ఏమీ ఉండదు. ఈ ప్రపంచంలో అందరూ అందంగానే ఉంటారు. కానీ ఆ విషయాన్ని మనం బలంగా నమ్మాలి. అప్పుడే అంత అర్థం అవుతుంది అని అంటుంది బెంగాలీ బ్యూటీ స్వస్థికా ముఖర్జీ. శరీరాకృతి గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి అని ఈ ముద్దుగుమ్మ సూచిస్తోంది. పలు వెబ్ సర్వీసులతో చాలా బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొంది.

ఈ సందర్భంగా తన ఫోటోలను షేర్ చేసిన ఈ బ్యూటీ బాడీ యొక్క పాజిటివిటీ గురించి జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. గ్లామర్ ప్రపంచం లో అందానికి నిర్ణీత ప్రమాణాలు నెలకొల్పుతుంది. సమాజం కూడా వాటినే అనుసరించాలనే భావన గాల దేశంలో మనం ఉన్నాం. నా వరకైతే నాకు అలాంటి ప్రమాణాలు అస్సలు నచ్చవు. ఈ నిర్వచనాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అందమైన వారే.. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా బలంగా నమ్మాలి. కొంతమంది వ్యక్తులు తమ ఫోటోలకు మెరుగులు దిద్ది వాటి సహజత్వం కోల్పోయే విధంగా తయారు చేస్తారు. కానీ నేను మాత్రం అలాంటి దాన్ని కాదు. నేను నా శరీరం ఎలా ఉందో అచ్చంగా అలాగే స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీరు కూడా అలాగే ఉండండి. అంటూ తన రూపాన్ని కెమెరాలో అందంగా చిత్రించిన ఫోటో గ్రాఫర్ కు ఈ ముద్దుగుమ్మ ధన్యవాదాలు తెలిపింది. 'హేమంతర్‌ పఖీ' చిత్రంతో 2001 లో బెంగాలీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ  'మస్తాన్‌'   సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు బెంగాలీ సినిమాతో  పాటు బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ బ్యూటీ దిల్‌ బెచారాలో ఆఖరి సారి కనిపించింది. ఇక  బ్లాక్‌ విడోస్‌ , పాతాళ్‌ లోక్‌ వంటి హిందీ వెబ్ సిరీస్ లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: