2008లో వచ్చిన ప్రముఖ టీవీ షో 'బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు)' ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సంవత్సరం టీవీలో అత్యధికంగా వీక్షించిన కార్యక్రమాలలో ఇది కూడా ఒకటి. ఈ షోలో నటించిన నటీనటులకు మంచి క్రేజ్ తెచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం అందులో క్రేజ్ తెచ్చుకున్న ప్రధాన నటీనటులు మనతో లేరు.

సిద్ధార్థ్ శుక్లా
సిద్ధార్థ్ శుక్లా గుండెపోటు కారణంగా గురువారం మరణించిన విషయం తెలిసిందే. 40 వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన సిద్ధార్థ్ మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి, 'బాబుల్ కా ఆంగన్ చోటే నా' చిత్రంతో తన నటనను ప్రారంభించాడు. తరువాత అతను 'జానే పెహ్చన్ సే యే అజ్ఞబీ', 'లవ్ యు జిందగీ' వంటి షోలలో కనిపించాడు. కానీ 'బాలికా వధు'తో బుల్లితెర హీరోగా అతను ఇంటింటికీ తెలిసిన వ్యక్తి అయ్యాడు.

సురేఖ సిక్రీ:
గత జూలైలో ప్రముఖ నటి సురేఖ సిక్రి గుండెపోటు కారణంగా మరణించారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె 'బధాయ్ దో' చిత్రంలో ఉత్తమ నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 'బాలికా వధు'లో ఆమె నటించిన కళ్యాణి దేవి పాత్ర అందరి హృదయాలను కదిలించింది.

ప్రత్యూష బెనర్జీ
ఏప్రిల్ 1, 2016న ప్రత్యూష బెనర్జీ మృతదేహం ముంబైలోని ఆమె నివాసమైన కాండివాలిలో ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కానీ తల్లిదండ్రులు రాహుల్ రాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తమ కుమార్తెతో లైవ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నాడని, ఆమెను హింసించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పుడు రాహుల్ కోర్టులో కేసు నుండి డిశ్చార్జ్ కోసం అప్పీల్ చేశాడు. దరఖాస్తులో ప్రత్యూష తల్లిదండ్రులు తమ కుమార్తె పేరిట చాలా అప్పులు తీసుకున్నారని, వాటిని చెల్లించకపోవడం వల్లే నటి ఆత్మహత్య చేసుకుందని ఆయన చెప్పారు. ప్రత్యూష 'బాలికా వధు'లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: