అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి అనన్య నాగళ్ల. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన ఈమె.. బిటెక్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా చేశారు. కానీ సినిమాలు, నటనపై ఉన్న ఇష్టం ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాయి.

తాజాగా వకీల్‌సాబ్ సినిమాలో దివ్య అనే పాత్రలో నటించిన అనన్య... తన నటనతో తెలుగు అభిమానులను ఆకట్టుకున్నారు. మంచి సినిమా.. అదీగాక పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో సినిమా అంటే.. అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ఈమెకు గుర్తింపు రావడానికి ఓ ప్లస్‌ పాయింట్‌గా మారిందనే చెప్పవచ్చు. దీంతో ఈమెకున్న పాపులారిటీ అమాంతం పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఆమె తదుపరి చిత్రాలపైనే ఉంది. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే జర్నీ స్టార్ట్ చేసిన అనన్య.. తదుపరి సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్రేక్షకులు వకీల్‌ సాబ్‌ సినిమా తర్వాత అనన్యపై భారీ అంచనాలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఈమెతో చేయిస్తున్నారు.

అందులో భాగంగానే.. కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న చిత్రం  'ఏవం జగత్‌' . ఈ సినిమాకు సంబంధించిన ‘రాధాస్ లవ్‌' సాంగ్‌ను ఆమె విడుదల చేశారు.

" ఉదయించే సూర్యిడిలా ..
ప్రతిరోజు నిను చూసా ..
జనియించిందే ..
ఒక స్వప్నం.. !!"
అనే పల్లవితో సాగిన మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌కు శివ కుమార్ మ్యూజిక్ అందించగా.. సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు.  దీని వల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా..? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా..? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా "ఏవమ్ జగత్".  

ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ...వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలోనే ఈ మూవీని విడుదల చేస్తాం అని ఆయన తెలిపారు.  
ఈ పాటను విడుదలచేసిన సందర్బంగా అనన్య నాగళ్ళ చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: