మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ కి మంచు విష్ణుకి మధ్య పోటీ రసవత్తరంగా మారిందని తెలుస్తోంది. పోటీ తీవ్రత దెబ్బకు ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతూ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

అయితే జీవితా రాజశేఖర్‌ ఎన్నికల పై తాజాగా మీడియాతో మాట్లాడారని సమాచారం. 'తప్పులు అందరూ చేస్తారని వాటిని సరిదిద్దుకుంటామని ఇక ఎవరు ఏ ప్యానెల్‌లో ఉంటారన్నది వాళ్ల ఇష్టమని చెప్పినట్లు సమాచారం. బండ్ల గణేశ్‌ నా గురించి చాలా మాట్లాడారని ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే అతని పై మాట్లాడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ఇక పృథ్వీ అయితే నా పై ఈసీకి ఫిర్యాదు కూడా చేశాడని ఇది హాస్యాస్పదమని నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని అంతా జీవితా రాజశేఖర్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్ధం కావట్లేదని చెప్పారట. అస్సలు మంచి చేయడమే మేం చేస్తున్న తప్పా ఏమిటి అంటూ అని ఎమోషనలౌతూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆమె మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకురావడం ఆసక్తిని పెంచినట్లు తెలుస్తుంది.

ఇంతకీ ఎన్టీఆర్ గురించి ఏం చెప్పారో తెలుసా. 'ఇటీవల నేను ఓ పార్టీలో జూ.ఎన్టీఆర్‌ గారిని కలిశానని ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. ఆయన చాలా బాగా మాట్లాడారని ఈ సందర్భంలోనే నేను ఆయనతో 'మీరు నాకు ఓటు వేయాలి' అని అడిగానని చెప్పారట. దానికి ఆయన ఏమన్నారంటే 'దయచేసి నన్ను అడగొద్దు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది' అని ఎన్టీఆర్ అన్నట్లు సమాచారం. నిజంగానే ఎన్టీఆర్ చెప్పినట్లే పరిస్థితి ఉంది' అని జీవిత కామెంట్స్ చేసినట్లు సమాచారం.

జీవిత మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. 'నాకు మోహన్‌ బాబుగారు, విష్ణు అంటే ఎంతో గౌరవం ఉందని చెప్పారట.అయితే, విష్ణు తన సామర్థ్యంతో పోటీ చేయడానికి ముందుకు వచ్చారని కానీ నరేశ్‌ ను వెనకేసుకుని తిరగడమే బాగాలేదని చెప్పారట. ఇక మీకు ఓట్లు వేసిన వారికే సాయం చేస్తామంటున్నారు హేమ గారు ఎందుకు మొత్తం 900 మందికి సాయం చేస్తామని చెప్పి ఉండాల్సింది కదా అని ఆమె అన్నారట. అయినా ఒకరిపై ఒకరు అనుచితమైన కామెంట్స్ చేసుకోవడం మంచిది కాదని ఆమె అన్నట్లు సమాచారం..

అలాగే జీవిత మిగిలిన అంశాల పై కూడా తనదైన శైలిలో స్పందించారని తెలుస్తుంది. వాటిల్లో ముఖ్యంగా 'మా' ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని తీసుకురావడాన్ని తప్పుబట్టారని తెలుస్తుంది. ఇక గతంలో 'మా' ఎన్నికల్లో తమ ఫ్యామిలీ నరేశ్‌ కి సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది.ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టామని ఆవిధంగా నరేశ్‌ కు సంపూర్ణ మద్దతు ఇచ్చాం అని చెప్పుకొచ్చారట కానీ కొన్ని విషయాల్లో నరేశ్ ధోరణి మాకు నచ్చలేదు అని ఆమె చెప్పినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: