టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు బండ్ల గణేష్. బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో డేగల బాబ్జి అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. డేగల గణేష్ ను క్రొత్త డైరెక్టర్ వెంకట్ చంద్ర దర్శకత్వం చేయనున్నారు. ఈ సినిమాను ఎస్ రిషి ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా శనివారం విడుదల చేసారు. ఈ సినిమాకి కెమెరా మెన్ గా అరుణ్ దేవినేని చేయనున్నారు. ఈ కథని తమిళ చిత్రం "ఒత్తథా సేరుప్పు సైజు 7 " నుండి తీసుకోవడం జరిగింది. ఈ సినిమాని సెప్టెంబర్ మొదటి వరం లో సెట్స్ పైకి తీసుకు వెళ్లనుంది డేగల గణేష్ టీం.




 ఇప్పటి వరకు కామెడీ ప్రధాన పాత్రలో అలరిస్తున్న బండ్ల గణేష్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో అలరిస్తాడా అని అందరిలో సందేహం ఉన్నా బండ్ల గణేష్ ఓ ప్రధా పాత్రలో వస్తున్నా మొదటి సినిమా కావడం తో అందరిలో ఉచ్చుకథ నెలకొంది. వన్ మ్యాన్ ఆర్మీగా తెరకెక్కిన తమిళ్ వెర్షన్ లింకా బుక్ అఫ్ రికార్డు లో చోటు సంపాదించుకుంది అదేవిధంగా ఈ సినిమాకు నేషనల్ ఫిలిం అవార్డు (స్పెషల్ జ్యూరీ అవార్డు ) అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ చేయబోవడం విశేషం . చూడాలి మరి బండ్ల గణేష్ అమితాబ్ బచ్చన్ తో సారి సమానంగా నటిస్తాడో లేక ఆ సినిమాను ఓ కామెడీ ఎంటర్టైనర్ గా చేస్తాడో చూడాలి . బండ్ల గణేష్ చివరిగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ , క్రేజీ అంకుల్స్ లో కనిపించరు. తాజాగా మా ఎన్నికల సమరం నుండి తప్పుకుని ప్రకాష్ రాజ్ పనెల్ కి అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 10 న జరుగబోయే మా ఎన్నికల సమరం లో ఎవరు గెలుస్తారో వేచి చూడ వలసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: