మా ఎన్నికలకు రెండు నెలల ముందు మొదలైన గొడవలు ఎన్నికలు పూర్తయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు మా ఎన్నికల్లో కనిపించలేదు. మా ఎన్నికలంటే పెద్దగా పరిచయం కూడా లేదు. ఇండస్ట్రీ వాళ్ళు తప్ప మా ఆయన కలం పట్టించుకునే నాధుడే లేడు కానీ ఇప్పుడు అలా కాదు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మా ఎన్నికల కూడా పై క్రియేట్ అయింది ఎన్నికలపై బెట్టింగ్ లు నడిచే అంటే ఎలక్షన్స్ కు ఇంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మా ఎన్నిక‌లకు ఇంత క్రేజ్ వ‌చ్చినా ఎన్నోగొడ‌వ‌లు జ‌రిగినా ఎందుకు గొడ‌వ‌లు ప‌డుతున్నారో అర్థం కావ‌డం లేదు. 

మా లో ఉంది తొమ్మిది వంద‌ల మంది క‌ళాకారులు మాత్ర‌మే కాగా మా స‌భ్య‌త్వం తీసుకోవాలంటే 75వేలు చెల్లించాల‌ట‌..కాబ‌ట్టి ఆర్థికంగా అంతో ఇంతో బ‌లంగా ఉన్న వారే మా స‌భ్య‌త్వం తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే మా ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన ఓడిన అభ్య‌ర్థులు ఆ తొమ్మిది వంద‌ల మంది స‌భ్యుల కోస‌మే ఇంత రచ్చ చేస్తున్నారా..? క‌నీసం మా స‌భ్య‌త్వం తీసుకోలేని ప‌రిస్థితిలో ఉన్నవారి కోసం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారు అనేది దేవుడికే తెలియాలి.

ఇదిలా ఉంటే కేవలం ప‌దవిలో ఉంటేనే సినిమాలో ఉన్న పేద క‌ళాకారుల‌కు సేవ చేయొచ్చా..? కోట్ల‌కు కోట్లు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న న‌టీన‌టులు పేద క‌ళాకారుల‌కు, మా స‌భ్యుల‌కు ఎంతో సాయం చేస్తూ  ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వ‌రాదా...? అన్న ప్ర‌శ్న‌లు కూడా త‌లెత్తుతున్నాయి. సినిమాల‌తో కోట్లు సంపాదించిన హీరోలు హీరోయిన్ లు నిర్మాత‌లు మొన్న కరోనా విజృంభ‌న కాలంలో ఎంత మంది పేద కళాకారుల‌ను ఆదుకున్నారు...? మా అసోసియేష‌న్ లో గ‌తంలో ఉన్న మిగులు నిధుల‌తోనే స‌హాయ స‌హ‌కారాలు చేశార‌ని చెబుతున్నారు త‌ప్ప ఎంత మంది ముందుకు వ‌చ్చి స‌హాయం చేశారు. సినిమా అంటే కేవ‌లం హీరోలే కాదు కొట్లు సంపాదించుకున్న నిర్మాత‌లు ఉంటారు. అయితే సేవా కార్య‌క్ర‌మాల గురించి వ‌చ్చినప్పుడు మాత్రం హీరోలే చేయాలన్న‌ట్టు గా మాట్లాడుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: