నాగార్జున కెరియ‌ర్ స్టార్టింగ్ లో మంచి ద‌ర్శ‌కులు ఉన్నారు. కాద‌న‌లేం. అప్ప‌టికే మ‌ణిర‌త్నం, అప్ప‌టికే రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి మంచి ద‌ర్శ‌కులు ఆయ‌న‌కో ఇమేజ్ ఇచ్చారు. లేదా ఇమేజ్ లో ఉండ‌కు అని కూడా చెప్పారు. వారిద్ద‌రి ప్ర‌భావం కార‌ణంగా కొన్ని మంచి సినిమాలే చేశాడు నాగ్. రాఘ‌వేంద్ర‌రావు లాంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ల గోల‌కేం కానీ, కొన్ని మంచి సినిమాల‌తోనే త‌న‌ని తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న కొడుకుల వంతు వ‌చ్చేసింది. భిన్న‌మ‌యిన చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌న్న ఉద్దేశంతో వీళ్లు ప్రాజెక్టులు అంగీక‌రిస్తున్నారు. బాగుంది. చై కానీ అఖిల్ కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా డైరెక్ట‌ర్ల‌పై డిపెండ్ కావ‌డం అన్న‌దే త‌ప్పు. ఒక యాక్ట‌ర్ తనని తాను ఇంప్రూవ్ చేసుకోకుండా కేవ‌లం స్టోరీ బేస్డ్ మూవీస్ పై శ్ర‌ద్ధ పెట్ట‌డం వ‌ల్లే స‌క్సెస్ లు వ‌స్తాయి అనుకోవ‌డం క‌రెక్టు కాదు. వాటిలో హెవీ డ్రామా ఉంటుంది. కంటెంట్ ఉంటుంది. దానిని మోయ‌గ‌ల‌గాలి. పండించ‌గ‌ల‌గాలి. సాఫ్ట్ నేచుర్ ఉంటుంది. అది చూపించ‌గ‌ల‌గాలి. ఇవ‌న్నీ రావాలంటే యాక్టింగ్ స్కిల్స్ తెలియాలి. తెలియాలి అంటే ఇంకొంచెం త‌మ‌ని తాము మెరుగుపరుచుకోవ‌డ‌మో లేదా శిక్ష‌ణ తీసుకోవ‌డమో చేయాలి.

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలలో హీరో క‌న్నా హీరోయిన్ స్ట్రాంగ్.. ఈ సారి రివ‌ర్స్ .. హీరో స్ట్రాంగ్‌..తెలంగాణ యాస‌ను ప‌లికిస్తూ మంచి సినిమా చేయాల‌న్న త‌ప‌న శేఖ‌ర్ ది.. చైతూ అందులో ఒక్క వంతు అందుకున్నాడు. చేశాడు కానీ ఇంకా చేయాలి. చెప్పానుగా ఆ క్యారెక్ట‌ర్ కు ఉన్న డెప్త్ చాలా ఎక్కువ అది అర్థం చేసుకుని చేయాలి. చైతూ చేశాడు కానీ చాల్లేదు. ఇంకా ఏదో కావాలి. అది శేఖ‌ర్ చెప్పి చేయించుకోలేక‌పోయాడు కూడా! యాక్టింగ్ వ‌ద్దు బిహేవ్ చేస్తే చాలు అని చెప్పి ఉంటాడు శేఖ‌ర్.. బిహేవియ‌రిజం అయినా క్యారెక్ట‌ర్ కు అనుగుణంగానే ఉండాలి. చై కొన్ని సీన్స్ లో సాయి ప‌ల్ల‌వి ద‌గ్గ‌ర తేలిపోయాడు. ఆమె న‌ట‌న ముందు తేలిపోయాడు. ఇవాళ సినిమా హిట్ అయినా చై ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఎంతో! ఈ సినిమా సాయి ప‌ల్ల‌వి వ‌ల్లే ఆడింది అని చెప్ప‌ను కానీ మంచి క‌థ‌కు ఉన్న విలువ అలాంటిది అని మాత్ర‌మే చెబుతాను. శేఖ‌ర్ సిన్సియ‌ర్ ఎఫెర్ట్ ఇచ్చాడు. క‌థ‌, క‌థ‌నం అన్న‌వి సాగ‌తీత ధోర‌ణిలో కాకుండా చేశాడు బానే ఉంది కానీ ఆయ‌న కూడా కొన్ని చెప్పాల్సిన‌వి చెప్ప‌లేక‌పోయాడు. సో.. ఇలాంటి క‌థ‌ల‌కు చై స‌రిపోతాడు..అని మాత్ర‌మే ప్రూవ్ చేశాడు. ఇంకా ప్రూవ్ చేయాల్సిన‌వి, ఇంప్రూవ్ చేయాల్సిన‌వి  ఎన్నో!


ఆఖ‌రుగా అఖిల్..భాస్క‌ర్ డైరెక్ష‌న్ లో సినిమా..గ‌తం క‌న్నా బెట‌ర్ అయిన స‌బ్జెక్ట్..ఇది కూడా హెవీ వెయిట్ స‌బ్జెక్ట్.. అన్న‌య్య చేసిన ల‌వ్ స్టోరీ కి పూర్తి భిన్నం ఈ సినిమా.. అఖిల్ ఈ సినిమాతో కొంత బెట‌ర్ అయ్యాడు. అయితే ఆయ‌న చేయాల్సింది ఎంతో!
స్క్రీన్ ప్రెజెన్స్ లోనూ మార్పులు రావాల్సిందే. సో.. అఖిల్ హిట్ వ‌చ్చింది అని సంబ‌ర‌ప‌డిపోకుండా ఈ సినిమాలో ఆయ‌నేం త‌ప్పులు చేశారో అన్న‌ది తెలుసుకోగ‌ల‌గాలి. త‌న‌కు తానుగా తెలుసుకోగ‌లిగితేనే మున్ముందు మంచి సినిమాలు ఎంచుకునేందుకు వీలుంటుంది. ప్ర‌స్తుతానికి నాగ్ అనుకున్న గండం అయితే గ‌ట్టెక్కాడు. ఈ స‌క్సెస్ మానియా కంటిన్యూ కావాలంటే ఆ ఇద్ద‌రూ ఇంకా బాగా న‌టించ‌గ‌లగాలి. క్యారెక్ట‌ర్ ను పూర్తిగా అర్థం చేసుకుని న‌టించ‌గ‌ల‌గాలి. డైలాగ్ డెలివ‌రీపై ముఖ్యంగా కొన్ని ప‌దాలు ప‌లికే విధానంపై దృష్టి నిల‌పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: