ఈ దేశంలో సెలిబ్రిటీస్ ఎంతో మంది ఉన్నారు. వారిలో రాజకీయ రంగాలకు చెందిన వారు, సినిమా రంగానికి సంబంధించిన వారు ప్రజలకు బాగా దగ్గరగా ఉంటారు. దాంతో వారు తమ వారే అని భావిస్తారు. వారి విషయంలో ఏం జరిగినా తమకు జరిగినట్లుగానే బాధపడిపోతారు.

వెండితెర వేలుపులు అని అందుకే వారిని అంటారు. ఇదిలా ఉంటే వారిని కరోనా మహమ్మారి వదలడంలేదు. దాంతో అభిమానులు సైతం తెగ బాధపడుతున్నారు. ఈ మధ్యనే అఖండ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి కరోనా సోకింది. ఆ అమ్మడు హోమ్ ఐసోలేషన్ లో ఉండి వచ్చింది. అఖిల్ మూవీ ఏజెంట్ కోసం యూరప్ లో షూటింగ్ చేస్తున్న డైనమిక్ డైరెక్టర్ సురేంద్రరెడ్డికి కరోనా సోకింది అన్న వార్తలు వచ్చాయి. ఆయన అక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడు.

ఇపుడు లేటెస్ట్ గా విశ్వనటుడు కమల్ హాసన్ కి కరోనా సోకింది. ఆయన అమెరికా టూర్ చేసుకుని ఇండియా వచ్చాడు. దాంతో పాటు ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో  ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు. కమల్ కి కరోనా అంటే ఫ్యాన్స్ ఇపుడు తెగ బాధపడుతున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. వీరే కాదు చాలా మంది సినీ నటులు ఇపుడు కరోనా భయంతో ఉన్నారు. షూటింగులకు అన్ని చోట్లా పర్మిషన్లు వచ్చేయడంతో విదేశాలకు విమానాల ద్వారా ఎగిరిపోతున్నారు.

అయితే అక్కడ చూస్తే పరిస్థితి మామూలుగా లేదు. అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ని కరోనా పెద్ద ఎత్తున అలాగే ఇబ్బంది పెడుతోంది. దాంతో అక్కడికి వెళ్ళిన సినీ సెలిబ్రిటీస్ కూడా దాని బారిన పడుతున్నారు. ఇక అక్కడ నుంచి షూటింగ్ చేసుకుని వచ్చిన వారిని కలవాలంటే కూడా కొందరు భయపడుతున్నారు. మొత్తానికి దేశంలో కరోనా లెక్కలు బెంగ భయం లేకుండా ఉన్నా బయట దేశాలకు వెళ్లిన వారు మాత్రం జాగ్రత్తగా లేకపోతే మహమ్మారి అసలు వదిలేలా లేదు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: