దర్శకుడు రాజమౌళి జనవరి 7వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యం లో ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఏ సినిమాకై నా హీరో ముందుండి సినిమా ప్రమోషన్స్ నడిపిస్తే తన సినిమాలకు మాత్రం రాజమౌళి ముందుండి ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొని సినిమాలు బాగా ప్రమోట్ చేస్తాడు. ఆ విధంగా ఇటీవలే ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఓ విలేకరి ఆయన ను అడిగిన ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. 

తెలుగు సినిమాలలో ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో కలెక్షన్స్ విషయం లో అందరికీ ఎలాంటి సమస్య లేదా అని విలేకరులు ప్రశ్నించగా రాజమౌళి తన దృష్టిలో సినిమా బాగుం టే పోటీ వల్ల ఎలాంటి సమస్య ఉండదని, కలెక్షన్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన చెప్పాడు. సినిమా లో విషయం ఉంటే రెండు కాదు ఎన్ని సినిమాలు ఒకేసారి విడుదలైన కూడా బాగా ఆడతాయి అని ఆయన అభిప్రాయపడ్డాడు.

దీన్ని బట్టి ఆయన మాటలను బట్టి సంక్రాంతికి ఇంకో సినిమా విడుదలైన కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని తెలుస్తుంది. అయితే మీడియా ముందు ఇన్ని మాటలు చెప్పిన జక్కన్న తన సినిమాకు పోటీ లేకుం డా చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఆర్.ఆర్.ఆర్ సినిమా కు మూడు సినిమా లు పోటీగా రాబోతు ఉండగా వాటిలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా తన సినిమా కు గట్టి పోటీ ఇస్తుందని తెలిసి ఆ సినిమా ను పోటీగా ఉంచకూడదని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పవన్ తో భేటీ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: